RSS

భారత దేశం యొక్క కొత్త రూపాయి చిహ్నం

09 Feb

భారత దేశం యొక్క కొత్త రూపాయి చిహ్నం

కేంద్ర మంత్రిత్వ శాఖ ఆమోదించిన బారతీయ రూపాయి చిహ్నం

(కేంద్ర మంత్రి వర్గం ఆమోదించిన భారత దేశం యొక్క కొత్త రూపాయి చిహ్నం . భారతీయ రూపాయి తన

యొక్క స్వంత చిహ్నం కల్గి ఉంది. దేవ నాగరి లిపిలో ‘ ఆర్ ‘ కలిపిన ఈ చిహ్నం ప్రపంచంలో ప్రత్యేక

గుర్తింపు కల్గిన ద్ర వ్యాల్లో (కరెన్సీ- currency) ఐదవ స్థానంలో ఉంది. భారత దేశం యొక్క ఈ కొత్త

రూపాయి చిహ్నం లేదా భారతీయ రూపాయి చిహ్నం ఐఐటి లోని పోస్ట్ గ్రాడ్యుయేట్ డి. ఉదయ్ కుమార్

రూపొందించగా 2010 వ సంవత్సరం జూలై 15 వతేదీ  అంటే ఈ రోజు కేంద్ర మంత్రి వర్గం ఆమోదించింది.

ఈ రూపాయి ప్రపంచంలోని శ్రేష్టమైన దేశాల ద్రవ్యాలలో (కరెన్సీ) స్వంత చిహ్నం గల ఒక ద్రవ్యంగా

యుఎస్ డాలర్,  బ్రిటీష్ పౌండ్ – స్టేర్లింగ్,  యూరో ,  జపానీయుల ఎన్ కోవలోకి చేరింది.
new_rupee_india

ఈ చిహ్నం త్వరలో కరెన్సీ నోట్లపైన ముద్రించబడుతుంది. అలాగే నాణేల పైన

పొదగబడుతుంది (embossed). కరెన్సీ చిహ్నం కోసం నిర్వహించిన ఐఐటి పోస్ట్

గ్రాడ్యుయేట్ డి. ఉదయ్ కుమార్ రూపొందించిన చిహ్నం ఎంపిక చేయబడింది.

ఇందుకు అతడు 2.5 లక్షల రూపాయలను పురస్కారంగా అందుకో బోతున్నాడు.

దేశ వ్యాప్తంగా ఆరు నెలలలోపు ప్రపంచ వ్యాప్తంగా  18 నుంచి 24 నెలలలోపు కేంద్ర ప్రభుత్వం భారత

దేశంయొక్క కొత్త రూపాయి చిహ్నాన్ని లేదా భారతీయ రూపాయి చిహ్నాన్ని అమలులోకి తెచ్చే

ప్రయత్నం చేస్తుంది. కంప్యూటర్ కీ బోర్డు పైన మరియు సాఫ్ట్ వేర్ పైన ఈ చిహ్నాన్ని పొందుపరుస్తారు. ఈ

విధంగా కంప్యూటర్ ( ఎలక్ట్రానిక) పైన ప్రదర్శిస్తూ ముద్రించడం కూడా చేపట్టవచ్చు. ఈ విధానం వలన

భారత దేశం యొక్క చెలామణిలో ఉన్న ద్రవ్యం ( భారత దేశం రూపాయి) పాకిస్థాన్, నేపాల్ , శ్రీలంక ,

ఇండోనేషియా దేశాల రూపాయికి ఉన్న భేదం తెలుసుకునే వీలుంది.

గత సంవత్సరం భారత దేశంయొక్క రూపాయికి చిహ్నాన్ని రూపొందించాలని కేంద్ర ప్రభుత్వం నిర్ణయం

తీసుకుంది. దేశ చరిత్ర మరియు సంస్కృతిని ప్రతిబింబించేలాగా రూపాయి చిహ్నాన్ని రూపొందించాలని

ఆర్ధిక మంత్రిత్వ శాఖ భావించింది. ఆ కారణంగా ప్రజల నుంచి దరఖాస్తులను పోటీ కోసం ఆహ్వానించింది.

 

మీ యొక్క కంప్యూటర్ లో రూపాయి చిహ్నం పొందండి.

రూపాయి ద్రవ్య చిహ్నం భారత ప్రభుత్వం  15 జూన్ 2010 వతేదీన ఆమోదించింది. అందువలన

ఇప్పుడు ప్రతి ఒక్కరు ఈ చిహ్నాన్ని ఉపయోగించే అవసరం తెలుసుకోవాలి. ఈ రూపాయి చిహ్నాన్ని మీ

యొక్క మైక్రో సాఫ్ట్ వర్డ్ లో ఏ విధంగా ఉపయోగించాలో ఈ కింద వివరించడం జరిగింది.

http://blog.foradian.com/font-with-indian-rupee-symbol-download-and-us

మ్ ఎస్(MS Word) వర్డ్ లో రూపాయి చిహ్నం

* జత పరచిన రూపాయి టిటిఎఫ్ ఫాంట్ ను దయ చేసి గమనించండి.

* C: Windows Font Folder (సి: విండోస్ ఫాంట్ ఫోల్డర్) లోకి రూపాయి ఫాంట్ ను Rupee : ttfను కాపీ చేసి పొందుపరచండి.
* ఎమ్ ఎస్ వర్డ్  (MS Wordను open చేయండి)  ను తెరవండిి
* .ఎమ్ ఎస్ వర్డ్ యొక్క ఫాంట్ లిస్ట్ (జాబితా) నుండి ‘Rupee Foradian’ (రుపీ ఫోరాడియన్ ) అనే ఫాంట్ ను సెలక్ట్ (ఎన్నుకోండి) చేయండి.
* 1.Rs చిహ్నాన్ని మీ యొక్క కీ బోర్డ్ లోని టిల్డా(tilde) కీ దగ్గర క్లిక్ చేయండిి
 

Leave a comment