RSS

చిన్న మార్పులతో జీవితం సుఖమయం

08 Feb

          నగరాలలో జీవితం చాలా సంక్లిష్టమైపోతున్నది. ఉండడానికి ఇంత చోటు దొరికితే చాలనుకునే పరిస్థితి వచ్చింది. ఇక ఉండబోయే ఇంటిని వాస్తు ప్రకారం కట్టుకోవడమనేది అసాధ్యమయ్యే పనిగా తయారైంది. ముఖ్యంగా నగరాలలో, పెద్ద పెద్ద పట్టణాలలో పరిస్థితి కనుపిస్తుంది. ఎందుకంటే ఇక్కడ రియల్‌ ఎస్టేట్‌ వ్యాపారం జోరుగా నడుస్తుంటుంది. ముఖ్యంగా ఇటువంటి చోట్ల ఫ్లాట్లు కొనుగోలు చేసేవారు వాస్తు అంటూ పెట్టుకుంటే ఇల్లు దొరకడమే కష్టమయ్యే పరిస్థితి ఉన్నది. అందుకే అవేవీ పెట్టుకోకుండా నగర జీవులు దొరికిందే చాలు అని కొనేసుకుంటున్నారు. ఇటువంటి సందర్భంలో వాస్తు దోషాలను, ఇతరత్రా సమస్యలను అధిగమించేందుకు ప్రత్యామ్నాయం లేదేమోనని కంగారు పడనవసరం లేదు. ఇంటి మొత్తాన్నీ మార్చలేకపోయినా చిన్న చిన్న మార్పులు చేసుకోవచ్చు. తద్వారా ఆనందాన్ని జీవితంలోకి తెచ్చుకోవచ్చు.ఇంట్లో ఇంటీరియర్స్‌లోనూ, కొన్ని వస్తువులను వాడటం ద్వారాను సమస్యలను అధిగమించి జీవితాన్ని సంతోషమయం చేసుకోవచ్చని వాస్తు నిపుణులు చెబుతున్నారు. జీవితంలో సానుకూల మార్పు తెచ్చే విధమైన వాస్తు పరిష్కారాలు తెలుసుకుందాం. ఒకవేళ ఇంటికి ఈశాన్య దిక్కున కాకుండా ఇతర దిక్కులలో ఏదైనా కాలువ లేక నది వ్య తిరేక దిశలో పారుతుంటే ఇంటికి ఈశాన్య మూలన పశ్చిమానికేసి చూస్తున్న నృత్య గణేశుని బొమ్మ పెట్టుకోవడం ద్వారా దుష్ఫలితాలను అధిగమించవచ్చు. అలాగే ఇంటి లే దా అపార్ట్‌మెం ట్‌లో ఏర్పాటు చేసిన బోరింగ్‌ తప్పు డు దిశలో పెట్టి ఉంటే ఆ బోరింగ్‌కు నైరుతి దిశను చూస్తున్నట్టుగా పంచముఖ హనుమంతుడి ఫోటో వేళ్ళాడదీయడం మంచిది. ఇంట్లోకి ప్రవేశించిన వెంటనే ఎదురుగుండా ఉన్న గోడను ఖాళీగా ఉంచకుండా గణేశుని ఫోటో తగిలించడం మంచి చేస్తుం ది. అలా మొండిగోడలు ఒంటరితనానికి చిహ్నం. దానిని నివారించడానికి మంచి మార్గం గణేశుని బొమ్మ పెట్టుకోవడమే. ఒకవేళ ఇంటిమీద నుంచి హైవోల్టేజీ వైర్లు పోతుంటే ఇంటి డాబాపైన ప్లాస్టిక్‌ పైపులలో నిమ్మకాయలను పెట్టి అది మూడు అడుగులు బయటకు ఉండేలా పెట్టండి. ఇది ఆ వైర్లు ఉత్పత్తి చేసే శక్తి దోషాలను పరిహరిస్తుంది.

స్వస్తిక్‌ యంత్రాన్ని ఉపయోగించడం ద్వారా ఇంట్లో శక్తి వలయాలను పెంచుకోవచ్చు. అయితే ఈ పద్ధతి అవలంబించేం దుకు చాలా జాగ్రత్తలు తీసుకోవాలి. వాస్తు తెలిసిన వారి పర్యవేక్షణలో ఇది జరగాలి.

ఈశాన్య కోణంలో తూర్పు దిక్కున టాయిలెట్‌ నిర్మాణం ఆ ఇంట్లో ఉండేవారికి అనేక వ్యాధులకు కారణమవుతుంది. కనుక టాయిలెట్‌ను ఎప్పుడూ దక్షిణం లేదా పశ్చిమ దిక్కున నిర్మించాలి. లెట్రిన్‌ను కూడా మనం ఉత్తరం లేదా పశ్చిమ అభిముఖంగా కూచునేలా ఏర్పాటు చేసుకోవాలి.

వంటింట్లో గ్రైండర్‌, ఫ్రిజ్‌, షెల్ఫ్‌ వంటి భారీ వస్తువులను దక్షిణం లేదా పశ్చిమ గోడ వైపుగా పెట్టుకోవడం మంచిది.

ఒకవేళ ఆరోగ్య సమస్యలు ఎదుర్కొంటుం టే మీ మంచం ఎలా వేసుకున్నారో చూసుకోండి. వాస్తుశాస్త్రం ప్రకారం మంచానికి ఎ ప్పుడూ నాలుగు కోళ్ళు ఉండాలి. బాక్స్‌ తర హా మంచాలు గాలి ప్రవాహాన్ని నిలిపివేస్తాయి. అనారోగ్యానికి ఇదే ప్రధాన కారణమవుతుంది.

మంచాన్ని దూలం కింద కాకుండా పక్కకు వేసుకొని పడుకోవాలి.

పిరమిడ్లను ఇంట్లో పెట్టుకోవడం కూడా వాస్తు దోషాలను పరిహరిస్తుంది. వీటిని ఇం ట్లో కీలకమైన స్థానాలు అంటే మధ్య లేదా ఏదైనా ఒక నిర్దేశిత గదిలో లేదా శక్తికి కీలకమైన కేంద్రంలో పెట్టుకోవచ్చు. పిరమిడ్లు మా నవ ఆరా తాలూకు విద్యుదైస్కాంత క్షేత్రాన్ని సమతులం చేస్తుంది తద్వారా శరీరం, మనస్సు, పరిసరాల మధ్య సామరస్యాన్ని పెంచుతుంది.

ఏడుస్తున్న యువతి, యుద్ధ సన్నివేశాలు, శృంగార సన్నివేశాలు, ఆగ్రహంతో ఉన్న వ్య క్తి, గుడ్లగూబ, డేగ వంటి పోస్టర్లు అపశకు నం. కనుక అటువంటివి ఏవైనా ఇంట్లో ఉం టే వాటిని తక్షణమే తొలగించడం మంచిది.

ఇక తలుపుల విషయానికి వస్తే, తలుపులు బయటకు తెరుచుకునేలా ఉంటే తక్షణమే వాటిని మార్చి ఇంట్లోకి తెరుచుకునేలా పెట్టిం చుకోవడం ఉత్తమం. ఎందుకంటే ఇంట్లో ఉండే శక్తి ఇంట్లోనే ఉండాలంటే తలుపులు లోపలికే తెరుచుకోవాలి.

ఇంట్లో ఎడారి మొక్కలను పెంచడం మంచిది కాదు.

అలాగే తలుపులు కిర్రుమంటూ తెరుచుకోకూడదు. కనుక గడియలు, గొళ్ళెం వంటి వాటిని నూనె వేసి వదులు చేస్తుండాలి.

తులుపులు ఎప్పుడూ కుడి వైపుకి తెరుచుకోవడం మంచిది.

అలాగే హను మంతుడి ఫో టోను లేక బొమ్మను ఆగ్నేయం వైపు చూస్తున్నట్టుగా పెట్టడం మంచిది కాదు. ఇది అశుభాన్ని చేకూరుస్తుంది.

గది సీలింగ్‌కు ఐదు మూలలు ఉండరాదు. తలుపులు, కిటికీలు నైరుతి దిక్కున ఉండకూడదు.

ఆహారం తీసుకునేటప్పుడు కంచం ఆగ్నే యం దిక్కుగా ఉండాలి.

వంటగది ఆగ్నేయ మూల ఉండడం మంచి ది. ఒకవేళ అలా సాధ్యం కాని సందర్భంలో ఇంటికి వాయువ్య మూలన ఉంచడం మం చిది.

వంటగట్టు తూర్పు లేదా ఉత్తర గోడను అంటుకోకుండా చూసుకోవాలి. అలాగే స్టౌ బయటకు కనుపించేలా పెట్టుకోవడం మంచిది కాదు.

అలాగే స్టౌకు దగ్గరలోనే పంపులు, సింకులు ఉండకుండా చూసుకోవాలి. అగ్ని, జలం రెండూ పరస్పర విరుద్ధ పదార్ధాలు.

వంటగదిలో అల్మరాలు ఈశాన్య దిక్కున ఉంటే అందులో తేలికపాటి వస్తువులను మాత్రమే పెట్టుకోవాలి.

వంటగదిలో అటకలు ఎప్పుడూ వంటగట్టుపై ఉండరాదు.

వంటగదిలో పెద్ద కిటికీలు తూర్పు దిక్కున, చిన్నవి దక్షిణ దిక్కున ఉండేలా చూసుకోవాలి.

వంటగదికి అనువైన రంగులు ఆకుపచ్చ, లేత గులాబీ, ఆరెంజ్‌.

Advertisements
 
Leave a comment

Posted by on February 8, 2013 in Uncategorized

 

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

w

Connecting to %s

 
%d bloggers like this: