RSS

నత్తి.. నత్తిగా మాట్లాడే పిల్లల సమస్యకు చక్కటి పరిష్కారం…!

20 Mar

   ప్రస్తుత రోజుల్లో చిన్న పిల్లలు నత్తినత్తిగా మాట్లాడటం ఒక సాధారణ సమస్యగా మారింది.

ముఖ్యంగా ఈ సమస్య 2సంవత్సరాల నుండి 5ఏళ్ళ మధ్య ఉంటుంది. చిన్న పిల్లలు నత్తి నత్తిగా మాట్లాడటాన్ని ఇంగ్లిష్‌లో స్టామరింగ్ లేదా స్టట్టరింగ్ అంటారు. ఒక పదాన్ని ఉచ్చరించే సమయంలో తొలి అక్షరాన్ని పదే పదే పలుకుతూ ఉండటం, లేదా ఆ పదాన్ని గబుక్కున ఉచ్చరించలేక అదే మాటను మళ్లీ మళ్లీ అంటుండటం, ఒక్కోసారి మాట ఆగిపోయి ఒక పట్టాన గొంతు పెగిలి బయటకు రాకుండా ఉండటం… ఇవన్నీ స్టామరింగ్ లేదా స్టట్టరింగ్‌లో భాగమే. స్టామరింగ్ అన్నది చాలా సాధారణ సమస్య. మన జనాభాలో దాదాపు ఒక శాతం మందికి ఈ సమస్య ఉండనే ఉంటుంది.

నత్తి అన్నది అమ్మాయిల్లో కంటే అబ్బాయిల్లో ఎక్కువ.

కారణాలు :

నత్తికి చాలా కారణాలు ఉన్నాయి. జన్యుపరమైన, న్యూరోఫిజియలాజికల్ మార్పుల వల్ల ఒక్కోసారి నత్తి రావచ్చు. నత్తి ఉన్న పిల్లల్లో కొందరికి వినికిడి సమస్య కూడా ఉండవచ్చు. కాబట్టి పై సమస్యలు ఉన్నాయా లేదా అని పరీక్షించడం చాలా ముఖ్యం. పిల్లల మానసిక స్థితిని సరిగ్గా అర్థం చేసుకోకుండా వారిని ఇతరులతో పోల్చిచూడటం, వాళ్లపై ఒత్తిడి పెంచడం వంటి కారణాలతో స్టామరింగ్ ఇంకా ఎక్కువ కావచ్చు. మాటలు నేర్చుకునే వయసు పిల్లల్లో స్టామరింగ్ అన్నది చాలా సాధారణంగా కనిపించే సమస్య. అయితే వాళ్లలో వయసు పెరుగుతున్నకొద్దీ సమస్య తగ్గుతూ ఉంటుంది. పిల్లల్లో ఒకవేళ స్టామరింగ్ ఉంటే… ఐదేళ్లు వచ్చేనాటికి 65 శాతం మంది పిల్లల్లో, యుక్తవయసు వచ్చేదానికి ముందుగా 75 శాతం మందిలో ఈ సమస్య తగ్గిపోతుంది. నత్తి ఉన్న పిల్లలు మాట్లాడుతున్నప్పుడు వాళ్లు చెప్పేది పూర్తిగా వినాలి. వాళ్లను తొందరపెట్టకూడదు. వాళ్లకు మాట మాట్లాడుతున్నప్పుడు నత్తి వస్తుంటే వాళ్ల తరఫున మనమే మాట్లాడకూడదు. వాళ్లు మాట్లాడుతుండగా మధ్యలోనే అందుకుని మాట్లాడకూడదు. వాళ్లు చెప్పదలచుకున్నది పూర్తిగా చెప్పే వరకూ ఆగి వినాలి. వాళ్లను పూర్తిగా మాట్లాడనిచ్చేలా ప్రోత్సహించాలి.

నత్తి తగ్గడం ఎలా :

నత్తి విషయంలో కొన్ని మందులు వాడుకలో ఉన్నా వాటి వల్ల అంతగా ప్రయోజనం లేదు. స్పీచ్ ఫ్లుయెన్సీ, స్టామరింగ్ మాడిఫికేషన్ వంటి స్పీచ్‌థెరపీ ప్రక్రియల ద్వారా మంచి ప్రయోజనం ఉంటుంది. చాలామంది భాషావేత్తలు, వక్తలు ప్రాక్టీస్ ద్వారా నత్తిని జయించిన వారు ఉన్నారు. నత్తిని అధిగమించాలనుకున్నవారు ఈఎన్‌టీ నిపుణులను, స్పీచ్ థెరపిస్ట్‌లను సంప్రదించాలి. అదే సమయంలో ఈ సమస్యకు ఇంట్లో కూడా కొన్ని సాధారణ విధానాలు మరియు పద్దతులను ఉపయోగించి సమస్యను అధిగమించవచ్చు. అదెలాగో చూద్దాం…

మీ పిల్లలు నత్తిగా మాట్లాడే సమస్యను అధిగమించడానికి ఇంట్లో చేసి కొన్ని చిట్కాలు:

1. యోగ:

   యోగ అనేది మానసిక మరియు శారీరక ఆరోగ్యానికి ఉపయోగపడటమే కాదు,పిల్ల మరియు పెద్దలు ఎవరికైతే నత్తిగా మాట్లాడే సమస్య ఉంటుందో వారికి ఇది చాలా సహాయపడుతుంది. యోగ వల్ల వ్యక్తి యొక్క మానసిక మరియు ఆరోగ్యపరిస్థితి మెరుగుపరుస్తుంది. మీ పిల్లలు భయంతో లేదా ఆత్రుతతో నత్తిగా మాట్లాడం ప్రారంభమైనప్పుడు యోగా ప్రాక్టీస్ చేయడం వల్ల వారికి మానసిక విశ్రాంతితో పాటు సంతోషకరంగా ఉండడానికి సహాయపడుతుంది.

2. అద్దం ముందు ప్రాక్టీస్ చేయనండి:

నత్తిగా మాట్లాడుట అధిగమించడానికి ఉత్తమ పద్ధతి ఇది. మీ పిల్లలను అద్దం ముందు నిలబెట్టండి. ఇప్పుడు మీరు ఆమెను/అతన్ని వాక్యాలను పెద్దగా లేదా బిగ్గర చదవమని చెప్పండి. సాధారణంగా ఈ పద్ధతిని పిల్లలు భయాలను అధిగమించడానికి ఉపయోగిస్తుంటారు. ఈ టెక్నిక్ ను ప్రతి రోజూ సాధన చేయడం ద్వారా నత్తిగా మాట్లాడుట సమస్యలు అధిగమించడానికి సహాయం చేస్తుంది.

3. పుస్తకాలు చదవడం:

చాలా మంది పిల్లలకు పుస్తకాలు చదవడం ఇష్టం ఉండదు. తల్లిదండ్రులు మీ పిల్లలు పుస్తకాలు చదివే అలవాటును ఏర్పరచాలి. బిగ్గరగా చదడం వల్ల వ్యక్తిగతంగా కొంత ఇబ్బంది కలిగించవచ్చు. అయితే బిగ్గరగా చదివేటప్పుడు మీ పిల్లలు శ్వాస ఎలా తీసుకుంటాడు అనేదాన్ని మీరు గమనించవచ్చు. చాలా మంది పిల్లల్లో చదివేటప్పుడు లేదా మాట్లాడేటప్పుడు శ్వాసపీల్చుకోవడం వల్ల ఈ సమస్యను అధిగమించడానికి ఇది ఒక మంచి టెక్నిక్ గా భావించాలి.

4. సరిగ్గా శ్వాస తీసుకోవడం:

ఇంతకు ముందు మాట్లాడుకున్నట్లో పిల్లలు చదివేటప్పుడు, మాట్లాడేటప్పుడు శ్వాస తీసుకవడంలో ఇబ్బందులుంటే నత్తి సమస్య ఉన్నట్లు భావించాలి. ఈ సమస్య నుండి బయట పడాలంటే వారు శ్వాస పీల్లచడం, వదలడం వంటి సాధారణ వ్యాయామం సాధన చేయించడం అవసరం. ఇది వారు కొత్తగా మాట్లాడటానికి సహాయం చేస్తుంది.

5. స్పీచ్ థెరపి:

సైకాలజిస్ట్ మరియు స్పీచ్ థెరపిస్ట్ సలహా ప్రకారం, చాలా మంది తల్లిదండ్రులు వారే స్వయంగా చదవడం వల్ల నత్తిగా మాట్లాడే అవకాశం ఉందని, తల్లిదండ్రులు వారి చదవడంలో పదాలు పలకడం వంటివి సహాయ చేస్తుంటారు. అయితే వారే స్వతహాగా చదవడం లేదా స్పీచ్ ఇవ్వడం వల్ల వారు మాట్లాడే నైపుణ్యం మెరుగౌతుంది. ఎక్కువగా మాట్లాడం వల్ల వారిలో విశ్వాసం పెరుగుతుంది. కాబట్టి స్పీచ్ థెరపి చాలా బాగా సహాయపడుతుంది. ఈ సాధారణ చిట్కాలు పాటించడం వల్ల నత్తిగా మాట్లడుట సమస్యను అధిగమించడానికి బాగా సహాయపడుతుంది.

 

 

Advertisements
 

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

w

Connecting to %s

 
%d bloggers like this: