RSS

Author Archives: chilukaonline

నత్తి.. నత్తిగా మాట్లాడే పిల్లల సమస్యకు చక్కటి పరిష్కారం…!

   ప్రస్తుత రోజుల్లో చిన్న పిల్లలు నత్తినత్తిగా మాట్లాడటం ఒక సాధారణ సమస్యగా మారింది.

ముఖ్యంగా ఈ సమస్య 2సంవత్సరాల నుండి 5ఏళ్ళ మధ్య ఉంటుంది. చిన్న పిల్లలు నత్తి నత్తిగా మాట్లాడటాన్ని ఇంగ్లిష్‌లో స్టామరింగ్ లేదా స్టట్టరింగ్ అంటారు. ఒక పదాన్ని ఉచ్చరించే సమయంలో తొలి అక్షరాన్ని పదే పదే పలుకుతూ ఉండటం, లేదా ఆ పదాన్ని గబుక్కున ఉచ్చరించలేక అదే మాటను మళ్లీ మళ్లీ అంటుండటం, ఒక్కోసారి మాట ఆగిపోయి ఒక పట్టాన గొంతు పెగిలి బయటకు రాకుండా ఉండటం… ఇవన్నీ స్టామరింగ్ లేదా స్టట్టరింగ్‌లో భాగమే. స్టామరింగ్ అన్నది చాలా సాధారణ సమస్య. మన జనాభాలో దాదాపు ఒక శాతం మందికి ఈ సమస్య ఉండనే ఉంటుంది.

నత్తి అన్నది అమ్మాయిల్లో కంటే అబ్బాయిల్లో ఎక్కువ.

కారణాలు :

నత్తికి చాలా కారణాలు ఉన్నాయి. జన్యుపరమైన, న్యూరోఫిజియలాజికల్ మార్పుల వల్ల ఒక్కోసారి నత్తి రావచ్చు. నత్తి ఉన్న పిల్లల్లో కొందరికి వినికిడి సమస్య కూడా ఉండవచ్చు. కాబట్టి పై సమస్యలు ఉన్నాయా లేదా అని పరీక్షించడం చాలా ముఖ్యం. పిల్లల మానసిక స్థితిని సరిగ్గా అర్థం చేసుకోకుండా వారిని ఇతరులతో పోల్చిచూడటం, వాళ్లపై ఒత్తిడి పెంచడం వంటి కారణాలతో స్టామరింగ్ ఇంకా ఎక్కువ కావచ్చు. మాటలు నేర్చుకునే వయసు పిల్లల్లో స్టామరింగ్ అన్నది చాలా సాధారణంగా కనిపించే సమస్య. అయితే వాళ్లలో వయసు పెరుగుతున్నకొద్దీ సమస్య తగ్గుతూ ఉంటుంది. పిల్లల్లో ఒకవేళ స్టామరింగ్ ఉంటే… ఐదేళ్లు వచ్చేనాటికి 65 శాతం మంది పిల్లల్లో, యుక్తవయసు వచ్చేదానికి ముందుగా 75 శాతం మందిలో ఈ సమస్య తగ్గిపోతుంది. నత్తి ఉన్న పిల్లలు మాట్లాడుతున్నప్పుడు వాళ్లు చెప్పేది పూర్తిగా వినాలి. వాళ్లను తొందరపెట్టకూడదు. వాళ్లకు మాట మాట్లాడుతున్నప్పుడు నత్తి వస్తుంటే వాళ్ల తరఫున మనమే మాట్లాడకూడదు. వాళ్లు మాట్లాడుతుండగా మధ్యలోనే అందుకుని మాట్లాడకూడదు. వాళ్లు చెప్పదలచుకున్నది పూర్తిగా చెప్పే వరకూ ఆగి వినాలి. వాళ్లను పూర్తిగా మాట్లాడనిచ్చేలా ప్రోత్సహించాలి.

నత్తి తగ్గడం ఎలా :

నత్తి విషయంలో కొన్ని మందులు వాడుకలో ఉన్నా వాటి వల్ల అంతగా ప్రయోజనం లేదు. స్పీచ్ ఫ్లుయెన్సీ, స్టామరింగ్ మాడిఫికేషన్ వంటి స్పీచ్‌థెరపీ ప్రక్రియల ద్వారా మంచి ప్రయోజనం ఉంటుంది. చాలామంది భాషావేత్తలు, వక్తలు ప్రాక్టీస్ ద్వారా నత్తిని జయించిన వారు ఉన్నారు. నత్తిని అధిగమించాలనుకున్నవారు ఈఎన్‌టీ నిపుణులను, స్పీచ్ థెరపిస్ట్‌లను సంప్రదించాలి. అదే సమయంలో ఈ సమస్యకు ఇంట్లో కూడా కొన్ని సాధారణ విధానాలు మరియు పద్దతులను ఉపయోగించి సమస్యను అధిగమించవచ్చు. అదెలాగో చూద్దాం…

మీ పిల్లలు నత్తిగా మాట్లాడే సమస్యను అధిగమించడానికి ఇంట్లో చేసి కొన్ని చిట్కాలు:

1. యోగ:

   యోగ అనేది మానసిక మరియు శారీరక ఆరోగ్యానికి ఉపయోగపడటమే కాదు,పిల్ల మరియు పెద్దలు ఎవరికైతే నత్తిగా మాట్లాడే సమస్య ఉంటుందో వారికి ఇది చాలా సహాయపడుతుంది. యోగ వల్ల వ్యక్తి యొక్క మానసిక మరియు ఆరోగ్యపరిస్థితి మెరుగుపరుస్తుంది. మీ పిల్లలు భయంతో లేదా ఆత్రుతతో నత్తిగా మాట్లాడం ప్రారంభమైనప్పుడు యోగా ప్రాక్టీస్ చేయడం వల్ల వారికి మానసిక విశ్రాంతితో పాటు సంతోషకరంగా ఉండడానికి సహాయపడుతుంది.

2. అద్దం ముందు ప్రాక్టీస్ చేయనండి:

నత్తిగా మాట్లాడుట అధిగమించడానికి ఉత్తమ పద్ధతి ఇది. మీ పిల్లలను అద్దం ముందు నిలబెట్టండి. ఇప్పుడు మీరు ఆమెను/అతన్ని వాక్యాలను పెద్దగా లేదా బిగ్గర చదవమని చెప్పండి. సాధారణంగా ఈ పద్ధతిని పిల్లలు భయాలను అధిగమించడానికి ఉపయోగిస్తుంటారు. ఈ టెక్నిక్ ను ప్రతి రోజూ సాధన చేయడం ద్వారా నత్తిగా మాట్లాడుట సమస్యలు అధిగమించడానికి సహాయం చేస్తుంది.

3. పుస్తకాలు చదవడం:

చాలా మంది పిల్లలకు పుస్తకాలు చదవడం ఇష్టం ఉండదు. తల్లిదండ్రులు మీ పిల్లలు పుస్తకాలు చదివే అలవాటును ఏర్పరచాలి. బిగ్గరగా చదడం వల్ల వ్యక్తిగతంగా కొంత ఇబ్బంది కలిగించవచ్చు. అయితే బిగ్గరగా చదివేటప్పుడు మీ పిల్లలు శ్వాస ఎలా తీసుకుంటాడు అనేదాన్ని మీరు గమనించవచ్చు. చాలా మంది పిల్లల్లో చదివేటప్పుడు లేదా మాట్లాడేటప్పుడు శ్వాసపీల్చుకోవడం వల్ల ఈ సమస్యను అధిగమించడానికి ఇది ఒక మంచి టెక్నిక్ గా భావించాలి.

4. సరిగ్గా శ్వాస తీసుకోవడం:

ఇంతకు ముందు మాట్లాడుకున్నట్లో పిల్లలు చదివేటప్పుడు, మాట్లాడేటప్పుడు శ్వాస తీసుకవడంలో ఇబ్బందులుంటే నత్తి సమస్య ఉన్నట్లు భావించాలి. ఈ సమస్య నుండి బయట పడాలంటే వారు శ్వాస పీల్లచడం, వదలడం వంటి సాధారణ వ్యాయామం సాధన చేయించడం అవసరం. ఇది వారు కొత్తగా మాట్లాడటానికి సహాయం చేస్తుంది.

5. స్పీచ్ థెరపి:

సైకాలజిస్ట్ మరియు స్పీచ్ థెరపిస్ట్ సలహా ప్రకారం, చాలా మంది తల్లిదండ్రులు వారే స్వయంగా చదవడం వల్ల నత్తిగా మాట్లాడే అవకాశం ఉందని, తల్లిదండ్రులు వారి చదవడంలో పదాలు పలకడం వంటివి సహాయ చేస్తుంటారు. అయితే వారే స్వతహాగా చదవడం లేదా స్పీచ్ ఇవ్వడం వల్ల వారు మాట్లాడే నైపుణ్యం మెరుగౌతుంది. ఎక్కువగా మాట్లాడం వల్ల వారిలో విశ్వాసం పెరుగుతుంది. కాబట్టి స్పీచ్ థెరపి చాలా బాగా సహాయపడుతుంది. ఈ సాధారణ చిట్కాలు పాటించడం వల్ల నత్తిగా మాట్లడుట సమస్యను అధిగమించడానికి బాగా సహాయపడుతుంది.

 

 

Advertisements
 

ఒక మంచి తల్లిగా ఉండడం ఎలా?

   మంచి తల్లిదండ్రులుగా ఉండడానికి ఎన్నో విషయాలు నేర్చుకోవాల్సి వస్తుంది. కానీ, పిల్లల ఎదుగుదల విషయంలో తండ్రి కంటే తల్లే ప్రధాన పాత్ర పోషిస్తుంది. అలాగే, ఎన్నో సవాళ్ళను కూడా ఎదురుకోవాల్సి వస్తుంది.

అలాంటి సవాళ్ళను ఎలా ఎదుర్కోవాలో తెలుసుకుందాం. సూచనలు:

1. ఓర్పుగా ఉండండి.

  ఒక తల్లిగా కొన్ని సందర్భాలలో కొన్ని సవాళ్ళను ఎదుర్కోవాల్సి వస్తుంది. అలాంటి సమయాలలో ఓర్పుగా ప్రశాంతంగా ఉండండి. సమస్యలని పరిష్కరించడానికి ప్రయత్నించండి. ఏదైనా సందర్భంలో ఎలా ప్రవర్తించాలో ఎలా ప్రవర్తించకూడదో మీ పిల్లలకి ప్రశాంతంగా వివరించండి.

2. మీ పిల్లల అభిరుచులపై మీరు కూడా ఇష్టాన్ని వ్యక్తపరచండి.

  మీ అబ్బాయికి సంగీతమంటే ఇష్టమున్నట్లయితే, ఒక గిటార్ కొని ఇవ్వండి. మీ అబ్బాయి గిటార్ వాయిస్తుంటే వినండి. ఎలాంటి సంగీతం ఇష్టం, ఇష్టమైన పాట వంటి ప్రశ్నలు అడగండి. అలాగే మీ అమ్మాయికి ఫాషన్ మీద శ్రద్ధ ఎక్కువగా ఉంటే, సరదాగా షాపింగ్ కి కి తీసుకుని వెళ్ళండి. ఫాషన్ లో తనకి నచ్చిన విషయాలు అడిగి తెలుసుకోండి. వారి అభిరుచులని స్పష్టంగా తెలుసుకోండి. మీరు మీ పిల్లలని పిలిచినప్పుడు, వారి నుండి “ఏంటి” అని పెద్దగా లేదా బిగ్గరగా కోపం తో కూడిన స్వరం తో జవాబు వస్తే , “పర్వాలేదు, తర్వాత మాట్లాడదాం” అని చెప్పండి. ఆ తరువాత వారు మాములుగా ఉన్నప్పుడు కలిసి మాట్లాడండి. మీ పిలుపుకి వారి నుండి సరైన సమాధానం రాకపోతే అసలేం జరిగిందో వెళ్లి తెలుసుకోండి. లేదా వారే వచ్చి మీతో చెప్పేవరకు వేచి చూడండి.

3. డబ్బుల విషయంలో మరీ టైట్ గా ఉండకండి.

 ప్రతీ రోజు డబ్బులని మీ పిల్లలకి ఇవ్వడం మంచిది కాకపోయినా వారు అడిగే ప్రతీ చిన్న విషయానికి డబ్బులు ఇవ్వరని చెప్పకూడదు. డబ్బులు అడిగిన ప్రతీ సారి పొదుపు, జాగ్రత్తలు వంటివి చెబితే వారి దృష్టిలో మీరు కఠినమైన తల్లిగా మిగిలిపోతారు. అవసరానికి తగ్గట్టు వారికి డబ్బులు ఇవ్వాలి . ప్రతిసారి ఏవైనా చిన్న చిన్నవి కొనిపెట్టండి. ఒక చాక్లెట్ లేదా చిప్స్ కొనిచ్చినా వారి సంతోషానికి అవధులు ఉండవు. అప్పుడప్పుడూ వారికవసరమైన వస్తువులని కొనిపెట్టండి. వారికి నచ్చిన రంగులో ఉండే ఐ పాడ్, లేదా టీనేజ్ పిల్లలకి అవసరమైన కంప్యూటర్ వంటివి కొనివ్వండి. వారు ఎప్పటినుంచో కావాలని ఆశ పడుతున్న వస్తువులని వారి పుట్టినరోజు కానుకలుగా ఇవ్వండి. అప్పుడప్పుడూ సరదాగా డిన్నర్ కి, ఏదైనా మూవీ కి తీసుకెళ్ళండి.

4. మీతో మీ పిల్లలు మాట్లాడేందుకు అందుబాటులో ఉండేలా జాగ్రత్త పడండి. అర్ధం చేసుకోవడానికి, చక్కగా వినడానికి ప్రయత్నించండి. అమ్మ దగ్గర లభించే సలహా, యుక్తవయసు పిల్లలకి అవసరమైన సూచనలు, స్నేహం, హోంవర్క్ లో సహాయం, లేదా మృదువైన కౌగిలి ఇవన్నీ పిల్లలకి ఒక ధైర్యాన్ని కలిగిస్తాయి. వారితో ఎవరూ మాట్లాడకపోతే వారు కొంచెం బోర్ గా ఫీల్ అవుతారు. కాబట్టి, వారితో వీలైనప్పుడల్లా మాట్లాడండి.

5. మీ పిల్లల అభిరుచులు, స్నేహితులు, ఇంకా వారి ఇష్టాలని ఎగతాళి చేయకండి. వారికి సహాయంగా ఉండండి. మీ పిల్లలకి మెడిసిన్ చదివి డాక్టర్ అవ్వాలని లేకపోతే మీరు వారిని బలవంతంగా డాక్టర్ అవ్వాలని ఇబ్బంది పెట్టకండి. ఇది మీ పిల్లల జీవితం. వారి జీవితానికి సంబంధించిన కొన్ని నిర్ణయాలు వారికీ తీసుకునే స్వేచ్చ ఉంది. మీ ఆలోచనలకి మీ పిల్లల ఆలోచనలకి భేదం ఉన్నా సర్దుకుపొండి. మీ ఆలోచనలకి భిన్నంగా ఆలోచిస్తున్నారని అవేశపడకండి. మీ అబ్బాయికి బాగా చదివి ఇంజనీర్ అవ్వాలని ఉంటే మీ వైపు నుండి సహాయపడండి. మీ పిల్లల స్నేహితులని చూసి ఎగతాళి చేయకండి. మీ అమ్మాయి హిప్ హాప్ మ్యూజిక్ విన్నా ఎక్కువగా ఐ లైనర్ పెట్టుకున్నా విమర్శించకండి. మీ అబ్బాయి హాస్యంగా యాస కలిగిన అబ్బాయితో స్నేహం చేసినా, మీ అబ్బాయి స్నేహితుడి స్కిన్ కలర్ నలుపు అయినా మీరు వారి స్నేహితుల విషయంలో జోక్యం చేసుకోకండి. మీ పిల్లలు చేసేవి కొన్ని మీరు చేయకపోవచ్చు. ఇది వారి జీవితం. మీ జీవితం కాదు. చదువు, ఆహారం, పాకెట్ మనీ వంటి ముఖ్య విషయాలలో మీ ప్రభావం ఎలాగో వారిపైన ఉంది. అతిగా వారి విషయాలలో జోక్యం చేసుకోకండి.

6. ఏదైనా తప్పు చేసినప్పుడు క్షమాపణ అడగడానికి ఆలోచించకండి. తప్పుని ఒప్పుకుని క్షమాపణ చెబితే అందరికీ మంచిది. మీరు క్షమాపణ చెప్పని మొండి వారిగా ఉండడం కంటే, తప్పు చేయడం సహజమని, చేసిన తప్పు సరిదిద్దుకుని క్షమాపణ అడగడం యొక్క విలువని మీ పిల్లలకి వివరించండి. ప్రశాంతంగా సందర్భాన్ని విశ్లేషించి, మీరు తప్పు ఎక్కడ చేసారో ఎందుకు చేసారో ఆలోచించుకోండి. ఆ తరువాత అలా ఎందుకు ప్రవర్తించవలసి వచ్చిందో తెలుసుకోండి. క్షమాపణ అడగడానికి “నా ప్రవర్తనకి నేను క్షమాపణ అడగదలుచుకున్నాను. అది తప్పని ఇప్పుడు అర్ధం అయ్యింది” అని అసలు విషయం తెలియచేయండి.

7. మీ పిల్లలు తండ్రిపై అమితమైన ప్రేమని చూపిస్తే ఈర్ష పడకండి.

8. చివరగా, మీ పిల్లలని అన్నింటికంటే ఎక్కువగా ప్రేమించండి. వారిని ప్రేమించకుండా వారి కి ఎన్ని చేసినా విలువ ఉండదు.

మీరు మీ పిల్లలని ప్రేమించినా లేకున్నా, వారి గుండె లోతుల్లో మాత్రం మీ పైన అమితమైన ప్రేమ ఉంటుందని అర్ధం చేసుకోండి. జాగ్రత్తలు:

1. మీ పిల్లల స్నేహితులతో ఉన్నప్పుడు మీరు మీ లాగే ప్రవర్తించండి. మీరు మీ పిల్లల తల్లి అని, ఒక స్నేహితురాలు కాదని గుర్తుంచుకోండి.

 

 

మీ ప్రవర్తనే మీ పిల్లలకు గుణపాఠాలు…!

   సహజంగా మనం గ్రహించి వుండంగానీ, మన వ్యక్తిత్వంలో చాలా భాగం మన తల్లితండ్రులు మనల్ని పెంచటంలోనే ఏర్పడుతుంది. ఒక్కసారి వెనక్కు తిరిగి చూస్తే, మనకున్న అనేక మంచి గుణాలలో చాలావరకు మనం మన తల్లితండ్రులనుండే నేర్చుకున్నాం. తల్లితండ్రులు తమ పిల్లలకు ఈప్రపంచంలో జీవించేందుకు ఎన్నో జీవిత పాఠాలు బోధిస్తారు. ఈ పాఠాలు వారు తమ వ్యక్తిగత అనుభవాలతో పొందుతారు. మీరు కనుక మీ పిల్లలకు కొన్ని అటువంటి జీవిత పాఠాలు బోధించాలని తలిస్తే అది అతని చిన్నతనంలోనే చెప్పండి. పిల్లలు చాలా విషయాల్ని పెద్దల్ని అనుకరిస్తూ తెలుసుకొంటారు.

అందుచేత తల్లితండ్రులు వాళ్లకి ఆదర్శప్రాయంగా ఉండి వారికి కొన్ని అలవాట్లు నేర్పించాలి. అవేమిటో చూద్దాం…

1. ప్రతీరోజూ నిద్రలేచిన తరువాత, రాత్రి పడుకోబోయే ముందు పళ్లను శుభ్రంగా తోముకోవడం నేర్పించాలి. పిల్లలకు ఊహ తెలిసినప్పటి నుండి వారికి ఆహారపు అలవాట్లను క్రమేపీ అభివృద్ధి చేయాలి.

2. పాలు తాగేటప్పుడూ, ఏదైనా తినేటప్పుడూ ఏవో ఆంక్షలు పెట్టి వారిని నివారించకూడదు.

3. అతిధుల ముందు ఎట్లా ప్రవర్తించాలో పిల్లలకు నేర్పాలి.

4. భోజనం చేసేటప్పుడు నేలమీద కాని, టేబుల్‌పైనగాని ఎట్లా జాగ్రత్తగా కూర్చోవాలో పిల్లలకు నేర్పాలి.

5. స్వీట్స్‌, ఐస్‌క్రీములూ పిల్లలు ఎంతో ఇష్టంగా తింటారు. కాని అవి వారి ఆరోగ్యానికి మంచివి కావు. పిల్లలు తీపిపదార్థాల్ని ఎంత తక్కువ తింటే అంతమంచిది. తల్లులే ఇంట్లో జంతికలు లాంటివి తయారుచేస్తే వాళ్లకు ఇష్టంగానూ ఉంటుంది. ఆరోగ్యంగానూ ఉంటుంది. వారు పప్పును, ఆకుకూరలను ఎక్కువగా తినేటట్లు చేయాలి.

6 పిల్లలకు చిరుతిళ్లు ఎక్కువ ఇష్టం అని మీరు కొని తేవద్దు. వాళ్లు కూడా కొనుక్కోకుండా చూడాలి. తింటే వ్యాధులొస్తాయని, అవి తినడం వల్ల ఎదుర్కొనే ప్రమాదాలేమిటో నచ్చచెప్పాలి.

7. ఏ సీజన్‌లో దొరికే పళ్లు ఆ సీజన్‌లో తినడం ఆరోగ్యదాయకం. పండ్లు ఎక్కువగా తినే అలవాటు చేయండి.

8 . పిల్లలు ఆహారాన్ని మెత్తగా నమిలితినాలి. పాలను కూడా నెమ్మదిగానే తాగాలి.

9. పిల్లలు ఒక్కొక్కసారి చాలా అల్లరి చేస్తారు. పెద్దలకు చిరాకు కలిగినా, వారిని తిట్టి కొట్టకూడదు. కారణమేదో తెలిసికొని వారిని మెల్లగానే మందలించాలి.

10. పిల్లల్ని క్రమశిక్షణలో పెడ్తున్నామనుకొని కొందరు తరచు పిల్లలపై కోపాన్ని ప్రదర్శిస్తుంటారు. దానివల్ల లాభం కంటే నష్టమే ఎక్కువ. తల్లిదండ్రులు పిల్లల్ని ప్రతీ చిన్న విషయానికీ దండించకూడదు. అలాంటి పిల్లలు అమాయకులుగా తయారౌతారు.

11. ఒకే ఇంటిలో ఇద్దరు లేక ముగ్గురు పిల్లలున్నప్పుడు వారి మధ్య తగాదాలు రావడం సహజం. తల్లిదండ్రులు వాళ్లని బుజ్జగిస్తూ, వారితో విడివిడిగా కొంచెంసేపు గడుపుతూ ఉండాలి. వారి మధ్య స్నేహభావం పెరిగేలా చూడాలి.

12. పిల్లలు పెంపుడు జంతువులను తాకకుండా ఉండేటట్లు దూరంగా ఉంచండి.

13. ఆ స్విచ్‌ వేయి, ఈ స్విచ్‌ని కట్టేయి అని మీ పిల్లలకు పనులను పురమాయించకండి. కరెంట్‌ వస్తువుల దగ్గరకు వాళ్లను అసలు పోనీయకండి.

14. నాణాలను, చిన్నచిన్న వస్తువుల్నీ చిన్నపిల్లలకు అందుబాటులో ఉంచకండి. వాళ్లు వాటిని మింగే ప్రమాదముంది.

15. పిల్లల్ని సరైన సమయానికి స్కూలుకు పంపి, స్కూలు అయిన వెంటనే ఇంటికి తిరిగి వచ్చేటట్లు చూడాలి. రోడ్‌పై నడిచేటప్పుడు ఫుట్‌పాత్‌పైనే నడవాలనీ, అక్కడ పరుగులు పెట్టకూడదని పిల్లలకు చెప్పాలి.

16. యూనిఫామ్‌ను, బూట్లు, టై ధరించడాన్ని పిల్లలు ఎవరికివారే చేసుకొనేటట్లు చూడాలి. అందువల్ల తల్లిదండ్రులకి కొంత శ్రమ తగ్గుతుంది. వారికి కూడా తమ పనులు తాము చేసుకోగలమన్న ఆత్మవిశ్వాసం వస్తుంది.

 

పిల్లలు పరీక్షల సమయంలో పిల్లల భయాన్ని పోగొట్టండిలా…!

    పిల్లలకు పరీక్షల హడావుడి మొదలవుతోంది. పరీక్షలంటే పిల్లలకే కాదు వారి తల్లదండ్రులు కూడా టెన్షన్ పడే కాలం ఇది. ఈ రెండు మూడు నెలల్లో ప్రతి ఇంట్లోనూ ఎవరో ఒకరు ఏదో ఒక పరీక్ష రాస్తుంటారు. ఇంత కాలం ఆడుతూ పాడుతూ గడిపిన పిల్లలు ఈ దశలో ఏకాగ్రతతో చదివితే కానీ మంచి మార్కులు రావు. ఇటువంటి పరిస ఎలా చదవాలి? పరీక్షలు ఎలా రాయాలి? అని తెగ ఆందోళన పడుతుంటారు.

నేడు పరీక్షల విషయంలో పిల్లలకంటే వారి తల్లిదండ్రులకే కంగారు ఎక్కువగా వుంటోంది. తమ ఇరుగుపొరుగువారి పిల్లలకంటే తమ పిల్లలకు ఎక్కడ తక్కువ మార్కులు వస్తాయేమోనని వారు భయపడతారు. ఈ కారణంతో తమ పిల్లల శక్తి సామర్థ్యాలతో సంబంధం లేకుండా బాగా చదవాలంటూ వారిపై వత్తిడి తీసుకువస్తారు. స్కూలులో టీచర్లు,

ఇంటి దగ్గర తల్లిదండ్రులు పిల్లలపై అధిక ఒత్తిడి తీసుకువచ్చి వారిలో వచ్చే మానసిక, శారీరక సంఘర్షణలకు కారణమవుతున్నారు. సర్వసాధారణంగా పరీక్షలు దగ్గరపడినపుడు, అవి ప్రారంభమైనపుడు పిల్లలు తమ మెదడుని పూర్తిగా పుస్తకాలకే అంకితం చేసేస్తారు. అలా చేయటం మంచిది కాదు. ఈ సమయంలోనే పిల్లలకు మానసికంగా, శారీరకంగా విశ్రాంతి అవసరం. మానసికంగా ఆందోళన చెందితే వారు పరీక్షలు సరిగా రాయలేరు. పైగా అంతకుముందు చదివినదంతా మర్చిపోయే ప్రమాదమూ వుంది.

పరీక్షల సమయంలో పిల్లలు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలో తెలుసుకుంటే వారిలో భయం, ఆందోళన వంటివి మాయమవుతాయి.ఇలా చదవడం వల్ల కూడా మానసిక ఆందోళన పెరిగే కొద్దీ పిల్లలు ఎక్కువ చదవలేరు. చదివినా మర్చిపోయే ప్రమాదం ఉంది. కాబట్టి పిల్లల్లో ఒత్తిడి ఆందోళన కలగకుండా వారు బాగా చదువుకుని మంచి మార్కులు సాధించాంటే కొన్ని సూచనలు తప్పకుండా పాటించాలి. అవేంటో ఒక సారి చూద్దాం…. 

1. అనుకూలమైన ప్రదేశం కల్పించాలి:

   పిల్లలు చదువుకోవటానికి నిర్దిష్టమైన స్థలాన్ని లేదా చోటును చూసుకోవాలి. నలుగురు కూర్చున్నచోట కూర్చుని చదవటంవల్ల వాళ్ళేం చదువుతున్నారో వారికి అర్థం కాదు. అందుకని సాధ్యమైనంత వరకూ ఏ విధమైన అడ్డంకులు లేకుండా చూసుకోవాలి. టీవీనో, డివిడిలో సినిమాలు చూస్తూనే చదువద్దు. మంచంపైన ఫ్లాట్‌గా, బోర్లా పడుకుని చదవకూడదు. ఎలాంటి సందడీ లేకుండా ప్రశాంతంగా ఉండాలి. మరో ముఖ్యమైన విషయం, రాత్రి పూట మేలుకుని ఉండి, పక్క మీద పడుకుని చదవడం కూడదు, చదువుకు బల్ల, కుర్చీ మేలైనవి. వీటి వల్ల ఏకాగ్రతకు భంగం కలగదు. చదువుకునేందుకు చక్కని భంగిమ కూడా అమరుతుంది.

2. సమయ పరిధి:

చదువుకునేటపుడు అదేపనిగా గంటలకు గంటలు చదవకుండా 40-45 నిముషాలకోసారి చదివేలా నిర్దిష్ట సమయాన్ని పిల్లలే నిర్ణయించుకోవాలి. మధ్యమధ్యలో టీవీ చూడకుండా కొంచెం సేపు విశ్రాంతి తీసుకోవాలి.

3. ప్లానింగ్ :

ఒకచార్టు తయారుచేసుకుని, దానిలో రోజూ మీరేం చదువుతున్నారో, ఎంత చదువుతున్నారో రాసుకోవాలి. ఆ విధంగా టైంటేబుల్ తయారుచేసుకుని ఒక క్రమపద్ధతి ప్రకారం చదివితే పరీక్షలు సమీపించే సమయానికి సిలబస్ పూర్తిచేయగలుగుతారు.

4. రిలాక్సేషన్ కోసం:

రిలాక్సేషన్ కోసం: అప్పుడప్పుడూ వ్యాయామాలు చేయటంవల్లకూడా మనసుకు సంతోషంగా అనిపించి రిలాక్స్ పొందే అవకాశం వుంది. మనసులో ఎటువంటి భయాలను పెట్టుకోకుండా హాయిగా, ఉల్లాసంగా, ఉత్సాహంగా ఉంటే తేలికగా పరీక్షలను ప్రశాంతంగా వారు రాయగలుగుతారు.

5. ఆహారం:

పిల్లల ఆహారం విషయంలో తగినంత శ్రద్ధచూపాలి. నిర్ణీత సమయానికి వారికి సరైన పోషక పదార్థాలతో కూడిన ఆహారాన్ని తినిపించాలి. తగినంత మంచినీరు కూడా తాగేటట్లు చూడాలి.పౌష్టికాహార లోపంవల్ల ఆరోగ్యం పాడవుతుంది. ఆ కారణంగా పరీక్షలు సరిగా రాయలేకపోతారు. కాబట్టి సరైన సమయానికి ఆహారం తీసుకోవాలి. టీ, కాఫీలు వంటివి మానేయాలి.

6. నిద్ర:

వేళకు తిండి తినకపోయినా, రాత్రిళ్ళు నిద్రపోకపోయినా శారీరకంగానూ, మానసికంగానూ అలసి పోయి చదువుపై ఆసక్తి తగ్గుతుంది. శ్రద్ధ తగ్గాక చదివేది అర్థం కాదు. దానితో జవాబులను బట్టీ వేయాలని చూస్తారు. ఇక సమస్యలు ప్రారంభమవుతాయి. ఇది గమనించి వారికి తిండి, నిద్ర సక్రమంగా లభించేట్లు చూడాలి. చదవాలి కదా అని తెల్లవార్లూ కూర్చోబెట్టకుండా తగినంత నిద్ర అవసరం అని గుర్తించాలి.

7. ఒత్తిడి కూడదు:

ప్రతిరోజూ ఉదయం 8 గంటలనుండి రాత్రి 8 గంటలవరకూ అంటే పనె్నండు గంటల పాటు పిల్లలకు స్కూలు, ట్యూషన్‌తోనే సరిపోతుంది. ఇక పరీక్షలు వచ్చిన సమయంలో నిరంతరం చదుతూనే వుంటారు. ఇలా ఎప్పుడూ చదువులో మునిగితేలుతూంటే వారిలో మానసిక ఒత్తిడి పెరిగి అనార్యోం పాలవుతున్నారు. పిల్లలపై ప్రతినిత్యం తల్లిదండ్రులు ఈ విధంగా ఒత్తిడి చేయడం, చదువు విషయంలో కఠినంగా ప్రవర్తించటం మంచిది కాదు.

8. టెస్ట్ :

స్కూలులో ఎలాగా టెస్ట్‌లు పెడతారు కదా అని బద్ధకించకూడదు. వాళ్ళకి వాళ్ళే స్వయంగా ఇంట్లో టెస్ట్ పెట్టుకుంటే పరీక్షలంటే భయం పోయి వారిపై వారికి ధైర్యం, నమ్మకం ఏర్పడతాయి. ఆత్మవిశ్వాసం.

9. నెగెటివ్ థింకింగ్:

చదువుకు సంబంధించి మనసులో ఏ విధమైన నెగెటివ్ థింకింగ్ (వ్యతిరేకంగా ఆలోచించటం)ను పెంపొందించుకోకూడదు. ప్రతి విషయాన్ని సానుకూల దృక్పథంతో ఆలోచించుకోవాలి. అప్పుడు భయం, ఆందోళన లాంటివి దరిచేరవు.

10. నిపుణుల సలహా:

విద్యార్థినీ విద్యార్థులు మానసిక వత్తిడికి లోనైతే కనుక ఒకసారి మానసిక వైద్య నిపుణులను సంప్రదించటం మంచిది. నిపుణుల కౌనె్సలింగ్ వల్ల పిల్లలలో నూతనోత్సాహం వస్తుంది. ఇక పిల్లల చదువుకు సంబంధించి తల్లిదండ్రుల పాత్ర ఎలా వుంటుందో పరిశీలిస్తే- పరీక్షల సమయంలో తల్లిదండ్రులు పిల్లలకు అన్నివిధాలా సహకరించాలి. ఆ సమయంలో వారికి అనుకూలమైన వాతావరణాన్ని కల్పించడం తల్లిదండ్రుల బాధ్యత. అంతేకాక పిల్లల ఆరోగ్యం విషయంలోనూ తగిన శ్రద్ధ తీసుకోవాలి. పిల్లలు ఏ విధమైన మానసిక, శారీరక వత్తిడులకు లోనుకాకుండా చూసే బాధ్యత కూడా తల్లిదండ్రులదే.

 

పిల్లల గొంతులో ఆహారం పొరబడితే తీసుకోవలసిన జాగ్రత్తలు

తింటూ తింటూ పొరబోయి దగ్గు వస్తుంటే ఎవరో తలచుకున్నారంటూ పిల్లల తలమీద కాస్త సుతారంగా తట్టడం అన్నది ఈ లోకంలో ఏ చిన్నారికైనా అనుభవంలోనికి రాని విషయం కాదు. ఇలాంటి ప్రమాదాలు తరచూ అన్ని ఇండ్లలోనూ చోటుచేసుకునేవే.

అయితే గొంతులో ఆహారంగానీ మరేదైనా వస్తువుగానీ ప్రవేశిస్తే అది ప్రమాదంగా పరినమించకుండా చూసుకోవడం అవసరం.

అసలు పొరబోవడం ఎందుకో పొరబోకుండా తీసుకోవలసిన జాగ్రత్తలేంటో తెలుసుకుందాం…

ముక్కుతో పీల్చుకున్నా నోటితో పీల్చుకున్నా గాలి ఊపిరితిత్తులోకి వెళ్లడం మనం చూడవచ్చు. దీన్ని బట్టి తెలిసేదేమిటంటే.. తిన్న ఆహారంలో ఆహార వాహికలోనికి పోకుండా గట్టిగా దగ్గువచ్చిన ఆహారాన్ని బయటకు నెట్టేస్తుంది. ఇదే పొరబోవడం అన్నమాటి. అందుకే ఒ్కోసారి మనం పాలు లేదా నీళ్ల వంటి ద్రవపదార్థాలు తాగుతూ అకస్మాత్తుగా ఊపిరి పీల్చుకుంటే ఠక్కున పొరబోతుంది. అంటే గాలి వేళ్ళే దారికి ఎపిగ్లాటిస్ పొర అడ్డుపడుతుంది.

గొంతులో పదార్థాలు ఇరుక్కోకుండా తీసుకోవలసిన జాగ్రత్తలు ..

1. నాలుగేళ్ల లోపు పిల్లలకు నట్స్, గట్టిగా ఉండే చాక్లెట్ క్యాండీలు, పెద్ద గింజలుండే పండ్లు పెట్టకూడదు. పెద్దగా ఉన్న క్యారెట్, ఫ్రూట్ ముక్కలు తినిపించకూడదు.

2. నాలుగేళ్లలోపు వారికి పండ్లు, క్యారట్ వంటివి పెట్టాల్సి వస్తే వాటిని చిన్న ముక్కలుగా తురిమి పెట్టాలి. చాలా మెత్తగా నమిలి తినమని చెప్పాలి.

3. చిన్న పిల్లల చేతికి ఏవైనా బొమ్మలు ఇచ్చినప్పుడు వాటిని విరగొట్టడం సహజం. ఒకవేళ అలా జరిగినా వాటి విడిభాగాలు నోట్లోకి ప్రవేశించేంత చిన్నవిగా ఉండని బొమ్మలనే ఇవ్వాలి.

4. పిల్లలు బెలూన్ ఊదేటప్పుడు పక్కన పెద్దలు తప్పక ఉండేలా జాగ్రత్త తీసుకోవాలి.

5. పిల్లల ఉయ్యాలపై వేలాడతీసే రంగులు బొమ్మలు వాళ్ల చేతికి అందకుండా ఎత్తులో ఉండేలాజాగ్రత్త తీసుకోవాలి.

6. చిన్ని చిన్న పూసల్లా ఉండే బొమ్మలను చిన్న పిల్లలకు ఇవ్వడం సరికాదు. అలాంటి వాటితో పిల్లలు ఆడుతున్నప్పుడు పెద్దలు పక్కనే ఉండాలి.

7. మెడలో వేసుకొనే ఆభరణాలకు ఉండే సన్నపాటి చైన్ లను, లేస్ లను పిల్లలకు అందుబాటులో ఉంచకూడదు.

8. చిన్న పిల్లలు ఆడుకోవడానికి నాణాలు, కాయిన్స్ ఇవ్వడం సరికాదు. పొరబాటున వాటిని మింగేసే ప్రమాదం ఉంది.

గొంతులో వేదైనా ఇరుక్కున్నప్పుడు ఏంచేయాలి:

1. ఏదైనా మింగిన చిన్నారి దగ్గుతున్నా, గట్టిగా ఏడుస్తున్నా, మాట్టాడగలుగుతున్నా, గొంతులోంచి శబ్దాలు చేస్తున్నా అడ్డు చెప్పకండి. గట్టిగా దగ్గడం వల్ల మింగిన వస్తువులు బయటకు వచ్చే అవకాశం ఉంది.

 

 

 

పిల్లల్లో జ్ఞాపకశక్తి పెరగాలంటే ఏం చేయాలి?

  వయసు పెరిగేకొద్దీ జ్ఞాపకశక్తి తగ్గుతుంటుంది. దీనితో పలు ఇబ్బందులు తలెత్తుతాయి. మనం తినే ఆహారంలో మెగ్నీషియం సమపాళ్ళలో ఉంటే జ్ఞాపకశక్తి పెరగడంతోపాటు నేర్చుకోవాలనే ఆకాంక్ష మరింత పెరుగుతుంది.

    సాధారణంగా పిల్లలు చదివిన విషయాలను గుర్తుంచుకుంటారేవెూ గానీ, అదే పరీక్ష సమయంలో చదివిన విషయాలను మరచిపోతుంటారు. ఇలా మరిచిపోయేందుకు కారణం వారిలో పరీక్ష అంటే వున్న భయం, టెన్షన్‌ కావచ్చు. పరీక్షలొస్తున్నాయంటే చాలు పిల్లలు మానసిక ఆందోళనకు, ఒత్తిడికి గురవుతుంటారు.

వాళ్ళు మామూలు సమయాల్లో ఎంత బాగా చదివినా, ఆందోళన వల్లా, భయం వల్లా పరీక్షల్లో తగిన ఫలితాన్ని సాధించలేకపోతారు. ఇలాంటి టెన్షన్లకు పిల్లలు గురికాకుండా ఉండాలంటే తల్లిదండ్రులు కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలి.

1. పరీక్షలు సమీపిస్తున్నాయంటే పిల్లల్లో ఒక విధమైన భయానికి లోనవుతుంటారు. అలాంటి వారికి పోషకాలు గల ఆహారం వారి తల్లిదండ్రులు తప్పక ఇవ్వాలి.

2. పరీక్షలు సమీపిస్తున్న కొద్దీ మెదడు చలాకీగా పనిచేయాలన్నా, అనారోగ్యం, నిద్రలేమి, ఆందోళన సమస్యల బారిన పడకుండా ఉండేందుకు కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలి.

3. పిల్లలకు మంచి ఆహారంతోపాటు విటమిన్‌ బి12, విటమిన్‌బి6, విటమిన్‌ సి, ఇ, క్యాల్షియం, మెగ్నీషియం, పొటాషియం, పోలేట్‌ ఉన్న ఆహారాన్ని ఇవ్వాలి.

4. పరీక్షల సమయంలో కొవ్వు పదార్థాలను వీలైనంతవరకు తగ్గించడం చాలా మంచిది. ఎక్కువ ఫ్యాట్‌ ఉండే పదార్థాలను తీసుకోవడం వల్ల చురుకుదనం లోపిస్తుంది.

5. నేరేడు పండులో జ్ఞాపకశక్తిని పెంచే యాంటీ యాక్సిడెంట్లు ఎక్కువగా వుంటాయి. ద్రాక్ష, చెర్రీస్‌లో యాంటీ ఆక్సిడెంట్స్‌ అధికంగా ఉండడం వల్ల రోజూ ఒక గ్లాస్‌ ద్రాక్ష జ్యూస్‌ తీసుకోవడం ఎంతో మంచిది.

6. అలాగే ఆపిల్స్‌లో కూడా విటమిన్లతోపాటు కాల్షియం, క్వెర్‌సిటిన్‌, ఆంథోసియానిన్‌ అనే యాంటీ ఆక్సిడెంట్లు ఉండటం వల్ల మతిమరుపు సమస్యను తప్పించుకోవచ్చు. కొంతమంది ఆపిల్‌ తొక్కను తీసేసి పండును మాత్రమే పిల్లలకిస్తుంటారు. ఆపిల్‌ తొక్కలో కూడా మంచి పోషకాలు ఉంటాయనే సంగతిని మరవరాదు.

7. ఇక పాలకూర వాడకం కూడా జ్ఞాపకశక్తిని పెంపొందిస్తుంది. బొప్పాయి, అరటిపండులో ఉన్న పోలేట్‌, మెగ్నీషియం, పోటాషియం, విటమిన్‌ బి6 మెదడును ఆరోగ్యంగా ఉంచుతాయి. ఈ పండ్లలోని పిండిపదార్థం మెదడును ఎక్కువసేపు చురుకుగా ఉండేటట్లు చేస్తాయి.

8. తేనె వాడకం వల్ల యాంగ్జైటీ తగ్గి జ్ఞాపకశక్తి వృద్ది చెందుతుంది. పిల్లల్లో జ్ఞాపకశక్తి పెంపొందాలంటే, వారు పరీక్షల్లో మంచి మార్కులు సాధించాలంటే వారికి పోషకాహారం తప్పక అందించాలి.

 

మందుల వాడకుండానే జ్వరం తగ్గించడం ఎలా ?

 

పిల్లలకు జ్వరం ఉన్న సమయంలో, సాదారణంగా ఎక్కువ మంది ఎసిటమైనోఫెన్ కోసం మెడిసిన్ షాప్ కి వెళుతారు. మీ పిల్లలకు ఇచ్చే కొన్ని మందుల్లో ఉండే కొన్ని రసాయనాలు ఊపిరాడకుండా చేసే అవకాసం ఉంది. సహజంగానే జ్వరాన్ని తగ్గించుకొనే ప్రయత్నం చేయాలి. జ్వరం లక్షణాలు హైడ్రేటెడ్, వేడితో బాధపడుతూ ఉంటె శుభ్రంగా ఉండాలని గుర్తుంచుకోవాలి. సాదారణంగా జ్వరం ఒక లేదా రెండు రోజులలో తగ్గిపోతుంది.

సాధారణ చిట్కాలు:

1. కాలి పాదాలకు తడి సాక్స్ వేయండి. పిల్లల పాదాలు కవర్ చేయటానికి సాక్స్ పొడవుగా ఉంటాయి కాబట్టి ఒక జత కాటన్ సాక్స్ తీసుకోండి. పూర్తిగా చల్లని కొళాయి నీటిలో సాక్స్ ను తడిపి, అదనపు నీరు పిండి పిల్లల పాదాలకు సాక్స్నువేయండి. సాక్స్ డ్రై అయినప్పుడు మరల నీళ్ళతో తడిపి పిండి వేయాలి.

2. గోరు వెచ్చని నీళ్ళతో స్నానం చేయించాలి. అప్పుడు జ్వరంతో బాధపడుతున్న వ్యక్తి వెచ్చని ఉష్ణోగ్రత నెమ్మదిగా తగ్గిపోతుంది. ఉష్ణోగ్రత తగ్గటం కూడా గమనిస్తారు.

3. చాల అధిక జ్వరం ఉన్నప్పుడు ఒక పెద్ద కాటన్ కండువా తీసుకొని నీటిలో తడిపి పిల్లల తల మరియు మెడకు కప్పాలి. కండువా ఆరిపోయినప్పుడు మరల తడిపి పిండి కప్పాలి.

4. రెండు సంవత్సరాల కన్నా తక్కువ వయస్సు ఉన్న పిల్లలను మంచం మీద పడుకోపెట్టి స్వచ్ఛమైన ఆలివ్ నూనె తో మొత్తం శరీరంను మసాజ్ చేసి కాటన్ దుస్తులు మరియు ఒక దుప్పటిని కప్పాలి. ఈ నూనె జిడ్డు ను తొలగించటానికి ఉదయం స్నానం చేయించాలి.

5. నీరు పుష్కలంగా త్రాగాలి. ఎందుకంటే జ్వరం జీవుల పోరాడటానికి మీ శరీరం యొక్క సహజ ప్రతిస్పందన ఉంటుంది. నీటి కోల్పోవడం ద్వారా తీసుకువచ్చే అతిసారం లేదా వాంతులు వంటి వాటిని అరికట్టవచ్చు.

6. ఒక తేలికపాటి వస్త్రం ధరించాలి మరియు మందపాటి వస్త్రాన్ని ధరించకూడదు. మందపాటి వస్త్రాన్ని ధరించటం వల్ల మీ శరీర ఉష్ణోగ్రత పెరుగుతుంది. ఎందుకంటే కప్పుకోవటం వల్ల మీరు చల్లగా భావించినప్పటికీ దుప్పట్లు మీ శరీరం పరిధిలోకి రాదు.

7. మీ శరీర ఉష్ణోగ్రత తగ్గించడానికి సత్వర మార్గంలా చింతపండు రసం లేదా కలబంద జెల్ లేదా జామ ఆకు రసం ఉపయోగిస్తారు. నుదిటిపై ఈ రసాన్ని అప్లై చేయాలి. మీ శరీర ఉష్ణోగ్రత తగ్గేవరకు ఈ విధంగా అప్లై చేయండి. మంచి విశ్రాంతి కోసం ఇంటిలో కిటికీలు తెరవండి. ఫ్యాన్ వేయండి. కరెంటు లేకపోతే విసనకర్రతో విసరండి