RSS

Category Archives: హెల్త్ ఎడ్యుకేషన్

చిట్కాలు….

చిట్కాలు….

kira
కీరదోస మామూలు దోస రెండూ మనకు మేలు చేస్తాయి. రక్తపోటులో తేడా ఏర్పడిన వారికి దోసకాయ తినడం మంచిది. అందులోని పొటాషియం రక్తపోటులోని హెచ్చు తగ్గులను సవరిస్తుంది. దోసలోని లవణాలు గోళ్లను అందంగా, చిట్లకుండా ఉంచుతాయి. కళ్లకింద నల్లటి చారలను కీరదోసకాయ ముక్కలుగా తొలగించగలవు. కళ్ళు ఉబ్బినట్లు ంటే వాటి మీద తాజా కీరదోసకాయ ముక్కలను కాటన్‌ వేసి పెట్టుకుంటే చక్కటి ఫలితాలు ఇస్తుంది. శిరోజాల ఎదుగుదలకు కీర మంచిదే. అందులో సల్ఫర్‌, సిలికాన్‌ శిరోజాలకు ఆరోగ్యాన్నిస్తాయి. దోసరసం కడుపులో మంటను తగ్గిస్తుంది. జీర్ణక్రియను మెరుగుపరచడంలో కీరా బాగా పని చేస్తుంది. దోసను తొక్కుతో తినడం మంచిది. తొక్కులో విటమిన్‌ ‘కె’ సమృద్ధిగా ఉంటుంది. చర్మానికి మేలు చేసే గుణం దోస తొక్కులో వుంది. దోసకాయ మంచిది కదా అని ఊరగాయల రూపంలో తినకూడదు
 

చిట్కాలు…

చిట్కాలు…

 పంటి నొప్పితో బాధపడుతుంటే రెండు తులసి ఆకులతో పాటు చిటికెడు ఉప్పు, మిరియాల పొడి తీసుకుని మూడింటిని కలిపి పంటి కింద రెండు నిమిషాల పాటు అదిమి పెడితే ఉపశమనంగా ఉంటుంది.

ఉదయాన్నే అయిదు గ్లాసుల నీరు తాగితే నోటి దుర్వాసనను పూర్తిగా నివారించవచ్చు.

పరగడుపున తులసి రసంలో తేనె కలుపుకుని తాగితే దగ్గు, జలుబు నివారించవచ్చు.

అల్లం ముక్కతో పాటు కాస్త పంచదారని కలిపి తింటే దగ్గు నుండి ఉపశమనం లభిస్తుంది.

అప్పటికప్పుడు పంటి నొప్పి నుండి రిలీఫ్‌ కావాలంటే నొప్పి ఉన్న చోట లవంగాన్ని అదిమిపెడితే సరి.
చిట్కాలు..

జాజికాయ చిన్న పలుకు దవడకి పెట్టుకుని కొంచెం కొంచెంగా నమిలి తినాలి. ఇది శరీరానికి వేడి చేస్తుంది. జాపత్రి చిన్న ముక్క తమలపాకులో వేసుకొని తింటే నోటి దుర్వాసన నివారిస్తుంది.

లవంగం దవడకి పెట్టుకుని నమలాలి. పచ్చి పోక లు తమలపాకులో వేసుకుని తింటే నోటి దుర్వాసన తగ్గుతుంది.

నేరుడు విత్తులు, గింజ తీసేసిన కాకర కాయలు, నేలతంగేడు పూలు, పొడపత్రి, తిప్పతీగె, ఉసిరికా య చూర్ణం చేసి రెండు పూటలా నోట్లో వేసుకొని, నీరు తాగితే మధుమేహం నియంత్రిస్తుంది

 

పుచ్చకాయతో చికిత్సలు

పుచ్చకాయతో చికిత్సలు

 

watermelon
పుచ్చ పండులో ఉన్నన్ని నీళ్ళు మరే పండులోగాని, కాయలోగాని లేవు. పుచ్చకాయలో పొటాషియం ఎక్కువ ఉన్నది కాబట్టి మూత్రపిండాలు పనిచేయక ఉన్నవారు పుచ్చకాయలు తినరాదు. కానీ మూత్రం సరిగా రానివారు, మూత్ర విసర్జనలో మంట, చురుకులు ఉన్నవారు మూత్రపిండాలలో, మూత్రకోశంలో చిన్న చిన్న రాళ్లు ఉన్నవారికి పుచ్చకాయ చక్కని ఔషధంగా పనిచేస్తుంది. గ్లాసు పుచ్చకాయ రసంలో స్పూన్‌ తేనె కలిపి ప్రతిరోజు తీసుకుంటే గుండెజబ్బులు, మూత్రపిండాల వ్యాధులు తగ్గిపోతాయి. వేసవిలో అతిదాహం, చెమట ద్వారా ఖనిజ లవణాల లోపాలు తగ్గాలంటే పుచ్చకాయ తింటే నివారిస్తుంది. అన్ని రకాల జ్వరాలలో పుచ్చకాయ రసంలో తేనె కలిపి సేవిస్తే శారీరక నీరసం తగ్గి శక్తినిస్తుంది. మలబద్ధకం ఉన్నవారు ప్రతిరోజూ పుచ్చకాయ తింటుంటే మలబద్ధకం అంతరిస్తుంది. ఎండిపోయే పెదవులు తడిగా ఉంచుతుంది

 

ఆరోగ్య చిట్కాలు

ఆరోగ్య చిట్కాలు

 
జీలకర్ర, పంచదార కలిపి నమిలితే కడుపునొప్పి నుండి ఉపశమనం కలుగుతుంది.

గ్లాసు నీళ్ళలో పావు టీ స్పూన్‌ ఏలకుల పొడి కలుపుకుని తాగితే యూరినరీ ఇనెఫెక్షన్‌ బాధ నుంచి బయట పడవచ్చు.

అల్లం ముక్కని ఎండబెట్టి పొడి చేసుకోవాలి.ఇందులో చిటిెకడు జీలకర్ర పొడి, పంచదార కలిపి తింటే దగ్గు తగ్గుతుంది.

ప్రతీరోజు నీళ్లలో తులసి అకులు వేసుకుని తాగాలి. ఇలా చేస్తే గొంతు ఇనెఫెక్షన్‌ తగ్గుతుంది.

జ్వరం తగ్గాలంటే గుప్పెడు తులసి ఆకుల పసరు, రెండు చెంచాల తేనెతో కలిపి రోజుకు రెండు సార్లు తీసుకోవాలి

గొరువెచ్చని పాలలో మెత్తగా నూరిన మిరియాల పొడి కలిపి తాడితే జ్వరం తగ్గుతుంది.

ముక్కులోంచి రక్తం కారడం తగ్గాలంటే ఉల్లిపాయను దంచి రసం తీసి మాడుకు రాసుకుని, వేడి పదార్ధాలకు బదులు చలవ పదార్ధాలు తింటే మంచిది.

జలుబు, దగ్గు తగ్గాలంటే రెండు తమల పాకులు , మూడు వేయించిన లవంగాలు, ఐదు గ్రాముల అతిమధురం ,ఐదు గ్రాముల వాము, చిన్న కరక్కాయ ముక్క దంచి రసం తీసి రోజుకు మూడు సార్లు తాగాలి.

ఉదయం సాయంత్రం ఒక టీ స్పూన్‌ తుమ్మి ఆకు రసంతోపాటు రెండు టీ స్పూన్ల తేనెనుకలిపి రోజుకు రెండు సార్లు కళ్లలో వేయాలి. ఇలా మూడు రోజులు వేస్తే పచ్చకామెర్లు తగ్గుతాయి.‚

పంటి నొప్పితో బాధపడే వారు, ఒక లవంగాన్ని పంటికింద ఉంచితే మంచి ప్రభావం ఉంటుంది.

 

నిమ్మకాయతో చికిత్సలు

నిమ్మకాయతో చికిత్సలు

 నిమ్మకాయలో ఉన్న విటమిన్‌ సి పొటాషియం, ఫాస్పారిక్‌ యాసిడ్‌ మనం తీసుకున్న ఆహారపదార్ధంలోని ఐరన్‌ అనే ఖనిజం వంటపట్టేట్టు చేసి రక్తహీనత నుండి కాపాడుతుంది. నిమ్మపండుతోని క్షారాలు యూరికామ్లం ప్రభావం నశింపజేస్తుంది కాబట్టి నిమ్మరసం అధికంగా తీసుకుంటే మూత్రపిండాలలో రాళ్లు ఏర్పడే ప్రమాదం ఉంది. అతిగా ఏ పదార్ధాన్ని తీసుకున్నా ఏదో ఒక అనర్ధం వెన్నంటే ఉంటుంది. అదే తక్కువ మోతాదులో తీసుకుంటే మూత్రపిండాలలో వేరే కారణాలతో ఏర్పడిన రాళ్లను కరిగిస్తాయి.
Lemon

కాబట్టి నిమ్మకాయను అనుదినం ఆహారంలో సేవించే వారికి జీర్ణాశయంలోని హానిచేయు క్రిములు నశిస్తాయి. నిమ్మరసం రక్తకణాలలోని కొవ్వును కరిగించి రక్తప్రసరణ సక్రమంగా జరగడంలో ఎంతో ఉపకరిస్తుంది. వేసవిలో కలిగే తాపానికి చల్లని నీటిలో పంచదార, నిమ్మరసం కలిపి ఇస్తే తాపం హరిస్తుంది. ఇంకా వాంతులు అయ్యే వారికి ఇస్తే వాంతులు ఆపి, ఆకలిని పెంచుతుంది. జ్వరం ఉన్నవారికి ఇస్తే అతిదాహం, తాపం కూడా నివారిస్తుంది. రక్తం కారడం, విరేచనాలు కూడా తగ్గిస్తుంది

 

కంట్లో నలకపడినప్పుడు

కంట్లో నలకపడినప్పుడు

కంట్లో నలకపడినప్పుడు కంటిని నలుపుతారు. అలా నలుపకూడదు. చల్లటి నీటిలో 4 లేదా 5 సార్లు కంటిని శుభ్రంగా కడగాలి. నీరు కంట్లోకి వెళ్ళేలా అరచేతిలో నీరు పోసుకొని తలవంచి ఒకటి రెండు సెకనుల పాటు కంటిని ఉంచితే నలకలు ఏమైనా ఉంటే బయటకు వచ్చేస్తాయి

 

వంటింటి వైద్యం రామ ములుగ

 

tomato

మూత్రంలో రాళ్ళు ఏర్పడకుండా ఉండాలనుకునే వారు ప్రతి రోజూ ఉదయం పూట రామములగ పండు ఒక్కటి తింటే దానిలో సమృద్ధిగా ఉండే ఆమ్లాలు, విట మిన్‌ ఎ, సి, రాళ్ళు ఏర్పడకుండా కాపాడుతాయి. ప్రతిరోజూ ఖాళీకడుపుతో రెండు మూడు రామములగ పళ్ళు తింటే రెండు మూడు నెలల్లోనే అతి బరువు తగ్గించుకోగలుగుతారు. ఇంకా శరీరానికి కావాల్సిన అన్ని పోషకపదార్థాలు లభిస్తాయి. మధుమేహ వ్యాధిగ్రస్తులు ప్రతి రోజూ పై విధంగానే తీసుకుంటే మంచి ఫలితాలు కనిపిస్తాయి.

 

ఆరోగ్య ఖర్జూరాలు…

 
ఖర్జూరాల్లో ఉండే క్యాల్షియమ్, మాంగనీస్, కాపర్, మెగ్నీషియమ్ పోషకాలు మనలోని ఎముకల, పంటి ఆరోగ్యాన్ని కాపాడతాయి. పైగా పై పోషకాలు మనలో కండరాల, నరాల శక్తిని పెంపొందిస్తాయి. ఎర్రరక్తకణాల ఉత్పత్తికి కాపర్ చాలా అవసరం. ఎముకలకు మెగ్నీషియమ్ చాలా మేలు.

పై పోషకాలతో పాటు ఖర్జూరాల్లో విటమిన్-బి కాంప్లెక్స్, విటమిన్-కె లభ్యమవుతాయి. రక్తం గడ్డకట్టడానికి ఉపయోగపడేందుకు విటమిన్-కె చాలా అవసరమన్న విషయం తెలిసిందే. అందుకే పై సుగుణాలు ఉన్నందున రోజూ మనం తీసుకునే ఆహారంలో ఖర్జూరాలు ఉండేలా చూసుకోవడం ఎంతో మంచిది

 

జంక్అంటే జంకండి!

 
                                                           

మీ ఇంట్లో పిజ్జా, బర్గర్, పఫ్, ఫ్రెంచ్‌ఫ్రైస్, చిప్స్ లాంటివి తినని పిల్లలు ఉన్నారా? వచ్చే సమాధానం లేరు అనే. ఇప్పుడు మనం పాశ్చాత్య తరహా ఆహార అలవాట్లను నిరోధించలేం. సంప్రదాయ ఆహారాలను తయారు చేసుకోడానికి ఎంతో సమయం పడుతున్న వేళల్లో త్వరగా లభ్యమవుతున్నవాటిని రాకుండా అడ్డుకోలేం. కానీ అందులోని హానికరమైన అంశాలను గుర్తించి విచక్షణతో మెలగాలి. మనం ఆ ఆహార పదార్థాలను తీసుకుంటున్నప్పుడు వాటితో కలిగే హానిని కూడా గ్రహిస్తే వాటిని పరిమితం చేసుకోగలుగుతాం. అప్పుడప్పుడు మాత్రమే తీసుకుంటాం. అలాంటి విచక్షణను కలిగించేందుకే ఈ కథనం.

మనం ఆహారం కోసం ఏదో తింటుంటాం. అదే సమయంలో రుచిగా ఉండాలని కూడా కోరుకుంటాం. పిజ్జా, బర్గర్, పఫ్స్, చిప్స్ లాంటివి చాలా త్వరితంగా లభ్యమవుతున్నాయి. పైగా రుచి కూడా. అలాంటప్పుడు వాటిని తింటే తప్పేమిటి అనుకోకండి. వాటిని ప్రాసెస్‌డ్ ఫుడ్స్ అంటారు. ఏదైనా ఒక ఆహార పదార్థం దీర్ఘకాలం నిల్వ ఉండటానికీ, మరింత రుచిగా ఉండటానికి కొన్ని ప్రక్రియ (ప్రాసెస్)లను అనుసరిస్తాం. ఆ ప్రాసెస్‌ల వల్ల రుచి, చాలాకాలం నిల్వ ఉండే శక్తి (షెల్ఫ్‌లైఫ్) లభిస్తాయి. ఒక పదార్ధాన్ని నూనెతోనో, లేదా నేతితోనో చేస్తే త్వరగా చెడిపోవచ్చు. అందుకే అందులో దీర్ఘకాలం నిల్వ ఉంచే పదార్థాలు వాడతారు. వాటినే ప్రిజర్వేటివ్స్ అంటారు. ఇలా నిల్వ ఉంచేందుకు కొన్ని రసాయనాల మీద ఆధారపడాల్సి వస్తుంటుంది. నిజానికి మనం తీసుకునే ఆహారంలో అందులోని స్వాభావిక పోషకాలతో ఎలాంటి హానీ లేకపోయినా… ఈ రసాయనాలే ప్రమాదకారి. ప్రాసెస్‌డ్ ఫుడ్స్‌లో చాలాకాలం నిల్వ ఉంచేందుకు ప్రిజర్వేటివ్స్ వాడతారు కాబట్టి వాటిని కాస్త ఆలోచించి తినాలని సూచిస్తుంటారు నిపుణులు.

ఆహారాన్ని నిల్వ ఉంచేలా చేసే ఆ నూనె ఏమిటి?
స్వాభావికమైన వెన్న వాడితే దానితో చేసిన పదార్థం చాలా రుచిగా ఉంటుంది. కానీ వెన్న త్వరగా చెడిపోతుంది. అలా చెడకుండా ఉండే పదార్థం ఏదైనా ఉండి, అది వెన్నలాంటి రుచి ఇస్తే ఎంత బాగుంటుంది అన్న ఆలోచన నుంచి వచ్చిన పదార్థమే హైడ్రోజనేటెడ్ ఆయిల్. ఇందులో మామూలు వంటనూనె (వెజిటబుల్ ఆయిల్)ను అత్యధిక ఉష్ణోగ్రత వద్ద వేడిచేసి, అందులోకి హైడ్రోజెన్‌ను పంపుతారు. దీన్నే హైడ్రేజనేషన్ అంటారు. దాంతో నూనె కాస్తా వెన్నలాంటి పదార్థంగా మారిపోతుంది. వెన్నలాంటి రుచే ఇస్తుంది. ఇక్కడ ఇది రెండు రకాలుగానూ ఉపయోగపడుతుంటుంది. ఒకటి… నూనె ద్రవరూపంలో ఉంటే దాన్ని వాడుకోవడం ఒకింత కష్టం. దూరం తీసుకెళ్లాలంటే ఒలికిపోయే ప్రమాదం ఉంది. కానీ ఇది ఘనరూపంలో ఉంది. కాబట్టి ఒలికిపోయే ప్రమాదం లేదు. ఫలితంగా నిల్వకూ, రవాణాకూ, వాడుకోడానికీ చాలా సులభం. ఇక రెండో ప్రయోజనం… ఇది స్వాభావికమైన దానికంటే ఎక్కువ రోజులు నిల్వ ఉంటుంది.

వెన్నలో ఏముంది.. మరి వెన్నలాంటిదాంట్లో ఏముంది?
వెన్నలో విటమిన్ ఏ, విటమిన్ డి, విటమిన్ ఇ, విటమిన్ కె2 చాలా ఎక్కువ. వీటితో పాటు బ్యుటిరేట్, కాంజుగేటెడ్ లినోలిక్ యాసిడ్ (సీఎల్‌ఏ) అనే పోషకాలు ఉన్నాయి. బ్యుటిరేట్ మానసిక వ్యాధులను దూరంగా ఉంచుతుంది. జ్ఞాపకశక్తి పెంచుతుంది. తిన్న ఆహారమంతా ఒంటికి పట్టేలా చేస్తుంది. చిన్నపేగుల్లో వాపు, నొప్పి, మంటల (ఇన్‌ఫ్లమేషన్)ను తగ్గిస్తుంది. కాంజుగేటెడ్ లినోలిక్ యాసిడ్ (సీఎల్‌ఏ) గుండె ఆరోగ్యానికి మంచిది. వెన్న వల్ల స్థూలకాయుల్లో కొవ్వు తగ్గుతుంది. పొట్టలోని కొవ్వు తగ్గడానికి వెన్న ఎంతో ఉపయోగం. అంటే బరువు తగ్గడానికి కూడా ఇది ఉపయోగపడుతుంది. వెన్నలో యాంటీ ఆక్సిడెంట్స్, ఒమెగా-3, ఒమెగా-6 ఫ్యాటీ యాసిడ్స్ వ్యాధి నిరోధకశక్తి పెంచేందుకు, క్యాన్సర్ల నుంచి రక్షణ కల్పించేందుకు దోహదపడతాయి. మరి వెన్నలాంటి ఈ హైడ్రోజనేటెడ్ ఆయిల్‌లో పూర్తిగా భిన్నమైన ఫలితాలు ఇచ్చే గుణాలున్నాయి. ఇది గుండెకు మంచిది కాదు, శరీరంలోని కొవ్వును పెంచుతుంది. ఫలితంగా స్థూలకాయాన్ని కలిగిస్తుంది. పైగా ఇది క్యాన్సర్ కారకం కూడా.
అలర్జీలూ… మానసిక వ్యాధులు

మనం ఆహారంలో ఉపయోగించే ప్రిజర్వేటివ్స్‌లో చాలా వరకు రసాయన పదార్థాలే కావడంతో ఒక్కోసారి అవి శరీరానికి సరిపడకపోవడం వల్ల అవి తీసుకున్న వారిలో అలర్జీలు కలగడం మామూలే. అంతేకాదు… షెల్ఫ్‌లైఫ్ ఎక్కువగా ఉండటానికి చేసే రకరకాల ఆహారాలతో పిల్లల్లో అటెన్షన్ డెఫిసిట్ హైపర్ యాక్టివ్ డిజార్డర్ (ఏడీహెచ్‌డీ) అనే మానసిక వ్యాధి రావడం ఈ రోజుల్లో చాలా సాధారణంగా కనిపిస్తున్న అంశం.

ఎర్రగా ఊరిస్తోందా…? ఒక్క క్షణం ఆగండి…

మీరు ఏదైనా బేకరీలోకి వెళ్లినప్పుడు అందులో నిల్వ ఉన్న చికెన్ ఐటమ్ ఎర్రగా, ఆకర్షణీయంగా కనిపించిందా? అది మరీ ఎర్రగా ఉందంటే దానికి సోడియమ్ నైట్రేట్‌పాళ్లు ఉన్న ప్రిజర్వేటివ్ కలిపారని అర్థం. చికెన్ మంచి పోషకమే అయినా దాంతోపాటు జత కలిసి ఉన్న సోడియమ్ నైట్రేట్ కారణంగా అది కోలోరెక్టల్ క్యాన్సర్‌ను, ప్యాంక్రియాటిక్ క్యాన్సర్, బ్రెయిన్ క్యాన్సర్, ల్యూకేమియాలను కలిగించే పదార్థంగా మారుతుంది. అందుకే ఎర్రగా, ఆకర్షణీయంగా కనిపించే మాంసాహార బేకరీ పదార్థాలను తక్కువగానే తీసుకోవాలి. ప్రత్యామ్నాయ ఆహారాలుంటే వాటిని మానేసి ఏ శాండ్‌విచ్‌వైపో మొగ్గుచూపాలి. (అప్పుడు శాండ్‌విచ్‌లలో హైడ్రోజనేటెడ్ ఫ్యాట్‌కు బదులు స్వాభావికమైన వెన్న వాడిన వాటినే తీసుకోవాలని గుర్తుంచుకోండి).

కూల్‌డ్రింక్స్‌లోని కృత్రిమ రంగులు – ప్రిజర్వేటివ్స్

మనం కూల్‌డ్రింక్స్ తాగే సమయంలో వాటితో పాటు కొన్ని కృత్రిమ రంగులనూ బలవంతంగా శరీరంలోకి పంపుతాం. వాటిని అక్కడ ఉంచడానికి మన మూత్రపిండాలు అస్సలు ఒప్పుకోవు. అందుకే వీటిని బయటకు పంపేందుకు అవసరమైన దానికంటే ఎక్కువగా పనిచేస్తాయి. ఫలితంగా మూత్రపిండాల దెబ్బతింటాయి. ఇక కూల్‌డ్రింక్స్‌ను నిల్వ ఉంచేందుకు కొన్ని రసాయనాలు దోహదపడతాయి. అవే… సన్‌సెట్ ఎల్లో, ట్యాట్రజైన్, కార్మోయిసైన్, పాన్‌క్యూ 4ఆర్, సోడియం బెంజోయేట్ వంటి ప్రిజర్వేటివ్స్. కొన్ని సందర్భాల్లో సన్‌సెట్ ఎల్లో, క్వినోలిన్ ఎల్లో, అల్యూరా రెడ్, సోడియ మ్ బెంజోయేట్ వంటి అనేక రసాయనాల మిశ్రమాన్ని ఒకే ప్రిజర్వేటివ్స్‌గా కూడా వాడతారు. వీటివల్ల పిల్లలకు కలిగే అనర్థాలు అన్నీ ఇన్నీ కావు.

ఉదాహరణకు… సోడియం బెంజోయేట్ అనే రసాయనం మనం తీసుకున్న విటమిన్ ‘సి’తో కలిసినప్పుడు ఇది క్యాన్సర్ కారకం (కార్సినోజెన్)గా మారుతుంది. బాగా వయస్సు పైబడటం లేదా అతిగా ఆల్కహాల్ తీసుకోవడం వల్ల వచ్చే ఫలితాలు ఎలా ఉంటాయో సోడియమ్ బెంజోయేట్ తీసుకున్న వారిలోనూ అచ్చం అలాంటి దుష్పరిణామాలే కనిపిస్తాయి. కొన్నిసార్లు ఈ రసాయనం లివర్ సిర్రోసిస్‌కు, పార్కిన్‌సన్ డిసీజ్‌లాంటి వాటికి దారితీస్తుందని ఇటీవలి కొన్ని పరిశోధనలు చెబుతున్నాయి. అందుకే ఆస్ట్రేలియన్ ప్రభుత్వం సోడియం బెంజోయేట్‌కు బదులుగా కొన్ని హెర్బల్ ప్రిజర్వేటివ్స్ వాడేలా చేసేందుకు ప్రయత్నిస్తోంది. కొన్ని అమెరికన్ కంపెనీలు కూడా అదే పని చేస్తున్నాయి. ప్రస్తుతం ఆరోగ్యకరమైన ప్రిజర్వేటివ్స్‌ను రూపొందించడానికి విశేష పరిశోధనలు జరుగుతున్నాయి. అవి సఫలమైతే అప్పుడు ఈ ప్రిజర్వేటివ్స్ వల్ల కలిగే దుష్పరిణామాలు గణనీయంగా తగ్గవచ్చు. అప్పటివరకూ మనం ప్రాసెస్‌డ్ ఫుడ్స్ తీసుకుంటున్నా, కూల్‌డ్రింక్స్ తాగుతున్నా అప్రమత్తంగా ఉంటూ పరిమితంగా తీసుకోవడం తప్పదు.

కూల్‌డ్రింక్‌లోని ఫాస్ఫారిక్ యాసిడ్‌తో: దీనివల్ల దంతాలపై ఉండే అనామెల్ పొరను దెబ్బతింటుంది. దాదాపు 15 శాతం మంది పిల్లల్లో ఈ పొర దెబ్బతినడం, పళ్లపై మరకలు, చారలు ఏర్పడటం ఇప్పటికే కనిపిస్తున్న అనారోగ్యకరమైన పరిణామం. కూల్‌డ్రింక్స్ కంపెనీలు మాత్రం తమ పానీయాల్లో ఫాస్ఫారిక్ యాసిడ్ కేవలం అనుమతించిన మోతాదుల (పర్మిసిబుల్ లిమిట్స్)కు మించకుండా వాడుతున్నామని చెబుతుంటాయి. ఈ ఫాస్ఫారిక్ యాసిడ్ ఎక్కువ కావడం వల్ల అది క్యాల్షియం మెటబాలిజమ్‌ను దెబ్బతీస్తుంది. దాంతో ఎముకల ఆరోగ్యంపై దుష్ర్పభావాలు పడతాయని పరిశోధనలు పేర్కొంటున్నాయి.

అందుకే బేకరీలోకి ప్రవేశించే ముందు ఒక్కసారి ఈ అంశాలన్నీ గుర్తు తెచ్చుకుని మీరు తీసుకోబోయే ఆహారాన్ని వీలైనంతగా పరిమితం చేసుకోండి. ఆరోగ్యాన్ని పెంచుకోండి.

ఉప్పు కూడా ఒక ప్రిజర్వేటివే…

మనం ఆహారంలో తీసుకునే ఉప్పు కూడా ప్రాసెస్‌డ్ ఫుడ్స్‌లో ఒక ప్రిజర్వేటివ్‌గా వాడతారని మీకు తెలుసా? ఉప్పు వల్ల కలిగే అనర్థాలు అన్నీ ఇన్నీ కావు. ఉదాహరణకు… మనకు బాగా తెలిసిన ఉదాహరణ రక్తపోటు మాత్రమే. ఉప్పు ఎక్కువగా తీసుకుంటే రక్తపోటు పెరుగుతుందని చాలామందికి తెలుసు. కానీ ఉప్పు ఎక్కువగా వాడితే జీర్ణాశయం లోపలి గోడలపై ఉన్న పొరలు దెబ్బతింటాయి. ఫలితంగా అట్రోఫిక్ గ్యాస్ట్రయిటిస్, గ్యాస్ట్రిక్ క్యాన్సర్స్ వంటి జబ్బులూ రావచ్చు. మనం వాడే ప్రాసెస్‌డ్ ఫుడ్స్, అప్పడాలు, ఊరగాయలు (పచ్చళ్లు)… వీటన్నింటిలోనూ ఉప్పు ఎక్కువ. అందుకే వాటిని తక్కువగా తీసుకోవాలి.

కలుషితాహారం తిన్నప్పుడు కొన్ని జాగ్రత్తలు

ఏదైనా ఆహార పదార్థాలు తీసుకున్న తర్వాత వాంతులు, విరేచనాలు అవుతుంటే మీరు ఎక్కువగా నీళ్లు తాగుతూ ఉండటమో లేదా ఓఆర్‌ఎస్ తీసుకుంటూ ఉండటమో చేస్తూ మీ శరీరం లవణాలనూ, నీటిని కోల్పోకుండా చూసుకోండి.

వాంతులు, విరేచనాలు మరీ ఎక్కువగా ఉంటే సాధారణంగా దొరికే యాంటీ-వామిటింగ్ అండ్ డయేరియా మందులను డాక్టర్ సలహా మేరకు వాడవచ్చు. ఆన్ కౌంటర్ మెడిసిన్ వద్దు.

వాంతులు, విరేచనాలు సాధారణ యాంటీ వామిటింగ్ అండ్ డయేరియా మందులతో తగ్గకపోతే తప్పనిసరిగా ఆసుపత్రికి వెళ్లాలి. అక్కడ అవసరాన్ని బట్టి సెలైన్ ఎక్కించడం వంటివి చేస్తారు.

వాంతులు, విరేచనాలు అవుతున్నప్పుడు ఎట్టి పరిస్థితుల్లోనూ బయట లభించే పాల ఉత్పాదనలు వాడవద్దు.

 

పొటాషియమ్ ప్రాధాన్యం

పొటాషియమ్ ప్రాధాన్యం 

మనకు అవసరమైన లవణాల్లో ఒకటైన పొటాషియమ్ శరీరంలో లోపించిందనుకోండి… ఏం జరుగుతుందో తెలుసా? అసలు గుండె కొట్టుకోవడమే జరగదు. కండరం బిగుసుకోవడం జరగదు. అంటే… మనం దేన్నీ పట్టుకోవడం జరగదు. అంతెందుకు… అసలు కదలడమే సాధ్యం కాదు. ఒకవేళ పొటాషియమ్ తక్కువగా ఉంటే మీరు చదువుతున్న మ్యాటర్ అసలు అర్థం కాదు కూడా! ఎందుకంటే… మెదడులోని కణాలు పనిచేయడానికి కూడా పొటాషియమ్ కావాల్సిందే.

పైగా రక్తపోటును క్రమబద్ధీకరించే గుణం దీనికి ఉంది. మరి పోషకంగా ఇంతటి ప్రాముఖ్యత ఉన్న ఈ లవణం కోసం తీసుకోవాల్సిన ఆహారాలేమిటో తెలుసా? మనకు అందుబాటులో ఉండేది అరటిపండు. ఒక అరటిపండులో 400 మి.గ్రా. పొటాషియమ్ ఉంటుంది. ఒక అవకాడోలో 500 మి.గ్రా. పొటాషియమ్ ఉంటుంది. కానీ ఇది అందరికీ అంతగా అందుబాటులో ఉండదు. ఇక పై రెండూ అందుబాటులో లేకపోతే పొటాషియమ్ కోసం బంగాళాదుంప (ఆలుగడ్డ) మీద ఆధారపడండి. ఒక పెద్ద ఆలుగడ్డలో 1600 మి.గ్రా. పొటాషియమ్ ఉంటుంది

 

మజ్జిగే మందుగా…

                       

రుక్మిణికి కడుపులో తెరలు తెరలుగా నొప్పి. దానికి తోడు బంక విరేచనాలు. ఎప్పట్లాగే విరేచనాలను ఆపే మందులను తీసుకుని వాడినా ప్రయోజనం కనిపించలేదు. డాక్టర్‌ను కలిస్తే ఆయన ‘ఇరిటబుల్ బవెల్ సిండ్రోమ్’ అని చెప్పారు. ఇది కేవలం రుక్మిణికి మాత్రమే పరిమితమైన సమస్య కాదు. చాలామందిలో కనిపించేదే. అప్పుడు వాళ్లు చేయాల్సిందేమిటి? చాలా సింపుల్. వీలైతే మజ్జిగ తాగడం లేదా… మజ్జిగలో ఉండే వాటినే మందుల రూపంలో తీసుకోవడం.

మజ్జిగే మందెలా అవుతుంది?

మన జీర్ణవ్యవస్థ పొడవునా అనేక కోట్ల సూక్ష్మజీవులు నివాసం ఉంటుంటాయి. అవి కొన్ని కొన్ని వ్యాధులనుంచి మనల్ని రక్షిస్తుంటాయి. అంటే… పరోక్షంగా అవి మన రోగనిరోధకశక్తిని పెంపొంది స్తుంటాయి. అందుకే వాటిని ‘ప్రో-బయోటిక్’ అంటారు. మన సంప్రదాయంలో మనకు తెలియకుండానే మనం ప్రో-బయాటిక్స్‌ను తీసుకుంటూ ఉంటాం. ఉదాహరణకు ఇడ్లీ పిండిని రాత్రి కలుపుకుని ఆ మర్నాడు ఇడ్లీ చేసుకుంటాం. అలాగే దోసె పిండి కలుపుకుని కాస్తంత పులిసిపోయాకే అట్లు వేసుకుంటాం. ఎండన పడి వచ్చిన వారికి మజ్జిగ ఇస్తాం. ఇలా మనం మజ్జిగను తాగినప్పుడు కూడా మనకు మేలు చేసే అనేక సూక్ష్మజీవులను మన కడుపులోకి తీసుకుని, ఆరోగ్యాన్ని పెంచుకుంటాం. అంటే మజ్జిగరూపంలో మనం ఒకవైపు ఎండ దెబ్బ వల్ల వచ్చే డీ-హైడ్రేషన్‌ను నిరోధించుకుని, మరోవైపు పేగులకు మేలు చేసే సూక్ష్మజీవులనూ సమకూర్చుకుంటామన్నమాట. ఇలా మనం మన సంస్కృతి సంప్రదాయాల్లో ‘ప్రో-బయాటిక్స్’ను తీసుకునే అలవాటు ఎప్పట్నుంచో మనకు ఉంది. మనం మజ్జిగలా తీసుకునేదాన్నే ఇప్పుడు చాలామంది మందులా కూడా ఉపయోగిస్తున్నారు.

ఏయే జబ్బులకు…

పైన పేర్కొన్నట్లుగా రుక్మిణికి కలిగిన సమస్య చాలామందిలో కనిపిస్తుంటుంది. దీన్ని వైద్యపరిభాషలో ‘ఇరిటబుల్ బవెల్ సిండ్రోమ్’ అంటారు. ఇదిగాక అల్సరేటివ్ కొలైటిస్ అనే వ్యాధిలోనూ, క్రోన్స్ డిసీజ్‌లోనూ ఇలాంటి లక్షణాలే కనిపిస్తుంటాయి. అల్సరేటివ్ కొలైటిస్‌లో పెద్దపేగు, రెక్టమ్ (మలద్వారం పై భాగం) వాపు, నొప్పి, మంట (ఇన్‌ఫ్లమేషన్)కు గురవుతాయి. ఇక క్రోన్స్ డిసీజ్ ఉన్నవారిలోనైతే జీర్ణవ్యవస్థ ఏ భాగంలోనైనా ఇన్‌ఫ్లమేషన్ కనిపిస్తుంది. ఈ రెండు వ్యాధులను కలిపి ‘ఇన్‌ఫ్లమేటరీ బవెల్ డిసీజ్’గా వ్యవహరిస్తుంటారు.

ఎందుకొస్తాయి ఈ సమస్యలు…?

ఇరిటబుల్ బవెల్ డిసీజ్‌లు ఎందుకు వస్తాయన్న అంశంపై ఇప్పటివరకూ ఎలాంటి స్పష్టతా లేదు. కొంతమంది అయితే ఇవి మానసిక సమస్యల వల్ల కనిపించే శారీరక లక్షణాలని సిద్ధాంతీకరించారు. తీవ్రమైన ఒత్తిడితో పనిచేసే వారికి ఈ జబ్బులు వస్తుండటం గమనించారు.

తగ్గడానికి ఏం చేయాలి…?

ఉదయం తినే టిఫిన్లలో పాశ్చాత్య తరహా ఆహారాలు కాకుండా మన సంప్రదాయ వంటకాలైన ఇడ్లీ, దోసె వంటివాటిని తీసుకోవాలి. తరచూ తాజా మజ్జిగ తాగుతూ ఉండాలి. కాస్తంత పులిశాక తాగితే అందులో సూక్ష్మజీవులు పెరగవచ్చేమోగాని… అప్పటికే తాజా మజ్జిగ తన క్షారగుణాన్ని కోల్పోయి ఆమ్ల గుణాన్ని సంతరించుకుంటుంది. అప్పటికే మన జీర్ణవ్యవస్థలో అసిడిటీ ఉంటే… ఆ యాసిడ్‌కు… ఈ ఎసిడిక్ మజ్జిగ తోడై సమస్యను పెంచుతుంది. అందుకే తాజా మజ్జిగ తాగాలి. లేదా తియ్యటి పెరుగులోనూ ప్రో-బయాటిక్స్ ఎక్కువగానే ఉంటాయి. ఆహారంలో భాగంగా తీసుకునే రిఫైన్‌డ్ షుగర్స్, జంక్‌ఫుడ్‌ను పూర్తిగా మానేయాలి. వీలుకాకపోతే గణనీయంగానైనా తగ్గించాలి. ఇక కార్బోహైడ్రేట్స్ కోసం పొట్టుతో ఉండే అన్ని ధాన్యాలనూ తీసుకోవచ్చు కానీ కొంతకాలం పాటు మొక్కజొన్న, గోధుమలనుంచి మాత్రం దూరంగా ఉండాలి. తాజా పండ్లు, ఆకుపచ్చటి ఆకుకూరలతో మన పేగుల్లోకి పుష్కలంగా పీచు వెళ్లేలా చేసుకోవాలి. అప్పటికీ గుణం కనిపించకపోతే డాక్టర్‌లను అడిగి ఇప్పుడు టాబ్లెట్లు, కాప్సూల్స్, పౌడర్లు, సోయాబీవరేజెస్ రూపంలో లభ్యమవుతున్న ప్రోబయాటిక్స్ మందులు వాడాలి. అన్నిటికంటే ముఖ్యంగా ఒత్తిడి తగ్గించుకోవాలి.

 

హెల్త్ ఎడ్యుకేషన్ ( ప్రసవం తర్వాత )

  1. ప్రసవించిన మహిళకు ఇన్‌ఫెక్షన్‌లు ఎందుకు వస్తాయి? 

  2. మహిళకు ప్రసవం తర్వాత ఇన్‌ఫెక్షన్‌లు!

  3. బాలింతలలో ఇన్‌ఫెక్షన్‌ నివారణ, చికిత్సలు…!

  4. బిడ్డకు పాలు పట్టడంలో ఇబ్బందులు…!

  5. బిడ్డకు పాలు పట్టడం ఎపుడు మొదలుపెట్టాలి?

  6. ఆరు నెలల వరకు తప్పనిసరిగా…

  7. బాలింతలకు ఆహారం – కొన్ని చిట్కాలు

  8. బేబీలు బరువు సంతరించుకోవాలంటే!

  9. పాలు పట్టే దశలో తల్లికి అనారోగ్యం కలిగితే?

  10. బిడ్డ బరువును నిర్ణయించే తల్లిపాలు!

  11. పాలు పడితే స్తనాలు మెత్తపడతాయా?

  12. కాన్పు తర్వాత నడుముకు చేసే వ్యాయామాలు!

  13. ముచ్చటైన రూపం మీ సొంతమవ్వాలంటే!

  14. కాన్పు తర్వాత ప్రయాణాలు ఎప్పటివరకు సురక్షితం

  15. ప్రసవం తర్వాత మహిళ స్తనాలలో మార్పులు?

  16. ప్రసవం తర్వాత మహిళలో మార్పులు ఎలా?

  17. కొత్తగా పుట్టిన బిడ్డకు స్నానం చేయించవచ్చా?

  18. మహిళకు ముఫ్పై అయిదేళ్ళ తర్వాత గర్భం వస్తే?

  19. ఆలస్య గర్భధారణలో ఆరోగ్యకరమైన బిడ్డ!

  20. పాలు పట్టడం తల్లికి ప్రయోజనకరమే!